Thursday, May 9, 2024
- Advertisement -

కాబోయో భర్తతో తెగ ఎంజాయ్ చేస్తున్న చిన్నారి పెళ్లికూతురు!

- Advertisement -

ఒకప్పుడు బాలీవుడ్ బుల్లితెరపై ‘బాలికా వధు’ టీవీ సీరియల్ ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.  ఈ సీరియల్ తెలుగు లో ‘చిన్నారి పెళ్లి కూతురు’ గా మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన అవికా గోర్ తదనంతర కాలంలో సినీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో చిన్న పాత్రలో కనిపించినా.. తెలుగు లో ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం అయ్యింది.

‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘తను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది-3’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ మద్య ఈ అమ్మడు బొద్దుగా తయారు కావడంతో సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి. ఇటీవల ప్రత్యేక శిక్షణ తీసుకొని స్లిమ్ గా తయారైంది. లేటెస్ట్ పిక్స్ చూస్తే నమ్మలేనంత స్లిమ్ గా తయారైందని ఒప్పుకుంటారు. 

ఇదిలా ఉంటే అవికా తన కాబోయే జీవిత భాగస్వామి గురించి సోషల్ మీడియాలో వెల్లడించింది. మిలింద్ చంద్వానీని పెళ్లాడబోతున్నట్టు తెలిపింది. రోడీస్ రియాల్టీషోతో గుర్తింపు తెచ్చుకున్న మిలింద్ తో తాను ప్రేమలో ఉన్నానని వివరించింది.  “నా ప్రార్ధనల ఫలితం ఇతడే. ఈ మంచి వాడు నావాడు, నేనెప్పటికీ అతడి దాన్నే”  అంటూ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. గోవాలో ఈ జంట తెగ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

నగ్నత్వంపై నటి పూజాబేడీ సంచలన వ్యాఖ్య!

కాజల్, గౌతమ్ ల ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

శృంగార అనుభవం గురించి మహేష్ హీరోయిన్ ఏందో తెలుసా?

బాత్రూమ్ సెల్ఫీతో షాకిచ్చిన నిధి అగర్వాల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -