Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ భిన్నమైన వేషాలు.. హిట్ అయిన ఐదు సినిమాలు..!

- Advertisement -

హీరో అంటే వందమందిని మట్టి కరిపించాలి. హీరోయిన్‌తో డ్యూయట్లు వేయాలి. ఆడీపాడీ అలరించాలనేది రొటీన్ తెలుగు సినిమా ఫార్ములా. నటుడు అనేవాడు​ అలాగే ఉండాలన్న రూల్ లేదు కానీ, అలా ఉంటేనే ప్రేక్షకులు హర్షిస్తారన్న ఆలోచనే ఇంకా చిత్ర పరిశ్రమలో కొనసాగుతోంది. అయితే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అలాంటి నిబంధనలను పక్కన పెట్టి తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. భిన్నమైన వేషాలు వేసి జనం చేత నీరాజనాలు అందుకున్నారు. ఆయన చేసిన ఈ ఐదు సినిమాలే అందుకు నిదర్శనం.

పిచ్చి పుల్లయ్య(1953)
ఎన్టీఆర్ సొంత సంస్థ నేషనల్ ఆర్ట్స్ పతాకంపై ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అమాయకుడైన పల్లెటూరి వ్యక్తి వేషం వేశారు. అప్పటికే ‘పాతాళభైరవి’, ‘మల్లీశ్వరి’ లాంటి సినిమాలతో గ్లామర్ హీరోగా చలామణీ అవుతున్న ఆయన ఇలాంటి పాత్ర వేయడం సాహసమే! అయితే ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయింది.

కన్యాశుల్కం (1955)
గురజాడ అప్పారావు రాసిన ‘కన్యాశుల్కం’ నాటకం తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం. దాన్ని దర్శకుడు పి.పుల్లయ్య సినిమాగా తీసినప్పుడు ఎన్టీఆర్ అందులో గిరీశం పాత్ర వేశారు. కొంచం విలనీ, కొంచం కామెడీ కలగలిసిన ఆ పాత్రలో ఆయన చక్కగా ఒదిగిపోయారు. ఇదే చిత్రంలో మహానటి సావిత్రి మధురవాణి పాత్ర చేయడం మరో విశేషం.

కలసి ఉంటే కలదు సుఖం(1961)
తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అవిటివాడిగా నటించారు. సినిమా అంతా ఒంటి చేత్తో నటించడం, డీగ్లామరస్‌గా కనిపించాల్సినా ఆయన ఏమాత్రం వెరువలేదు. పాత్రకు వందశాతం న్యాయం చేశారు.

బడిపంతులు(1972)
ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్కూల్ టీచర్‌గా కనిపిస్తారు. ముగ్గురు పిల్లల తండ్రిగా ఇటు కుటుంబాన్నీ, అటు బడినీ చక్కదిద్దే పాత్రలో ఆయన నటన అజరామరం అనిపిస్తుంది. ఈ పాత్రకు గానూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి పురస్కారానికి ఆయన నామినేట్ అయినా పురస్కారం దక్కలేదు.

శ్రీనాథ కవిసార్వభౌమ(1993)
ఈ చిత్రంలో నటించే సమయానికి ఎన్టీఆర్ వయసు అక్షరాలా 70 సంవత్సరాలు. అయినా ఏమాత్రం అలుపు లేకుండా ఆయన శ్రీనాథుడి పాత్రను అద్భుతంగా పోషించారు. వైభవ్ బతికి చివరి రోజుల్లో చితికిపోయిన వ్యక్తి శ్రీనాథ కవి. ఆ పాత్రపై మక్కువతో ఈ చిత్రాన్ని తానే సొంతంగా నిర్మించారు. అయితే జనానికి ఈ సినిమా పెద్దగా ఎక్కలేదు. దాంతో అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -