Friday, April 26, 2024
- Advertisement -

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

- Advertisement -

ఇప్పుడంటే ప్రతి చేతికి మొబైల్ ఫోన్లు వచ్చి కాలక్షేపానికి అనేక దారులు చూపిస్తున్నాయి కానీ, గతంలో కాలక్షేపం అంటే నవలలే! రచయిత రాసిన ఒక్కో వాక్యాన్ని తన్మయత్వంతో చదువుతూ అందులో లీనమయ్యేవారు. తెలుగులో​ నవలా రచయితగా అధిక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి యండమూరి వీరేంద్రనాథ్. ఆయన రాసిన అనేక నవలలు చిత్రాలుగా మారి జనాన్ని అలరించాయి. అందులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి నటించడం విశేషం. వాళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల్లో ఐదు సినిమాల గురించి ఇక్కడ..

అభిలాష(1983)
యండమూరి రాసిన నవలను అదే పేరుతో దర్శకుడు కోదండరామిరెడ్డి తెరకెక్కించారు. నవల ఎంత పాపులరో, సినిమా అంతకు మించి పాపులర్. చిరంజీవికి జోడిగా రాధిక నటించారు. ఇళయరాజా సంగీతంలోని పాటలు ఆల్‌టైమ్ హిట్స్.

ఛాలెంజ్ (1984)
‘డబ్బు టు ది పవరాఫ్ డబ్బు’ నవల ఆధారంగా ఈ సినిమా తీశారు. ఇందులో చిరంజీవి నటన చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. ఆయనకు జంటగా సుహాసిని, విజయశాంతి నటించారు. అనేక మందికి ఈ చిత్రం స్ఫూర్తినిచ్చింది.

రాక్షసుడు (1986)
‘రాక్షసుడు’ నవలను యథాతథంగా అదే పేరుతో తీశారు. చిరుకు జంటగా రాధ, సుహాసిని నటించారు. ఈ సినిమాలోని ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ పాటు నేటికీ శ్రోతల హృదయాలను అలరిస్తోంది.

దొంగమొగుడు(1987)
యండమూరి రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా మాధవి, భానుప్రియ, రాధిక నటించారు. ఇందులో చిరు ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాలో హీరో పాత్ర పేరు రవితేజ. ఈ చిత్రం చూసే తన పేరు మార్చుకున్నారు హీరో రవితేజ.

స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్(1991)
ఈ చిత్రానికి ఇదే పేరుతో యండమూరి రాసిన నవల ఆధారం. ఈ సినిమాకు ఆయనే దర్శకుడు కావడం విశేషం. విజయశాంతి, నిరోషా హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం పెద్దగా విజయం సాధించలేకపోయినా చిరంజీవి నటన మాత్రం అద్భుతం అనిపిస్తుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -