Saturday, April 27, 2024
- Advertisement -

ఎప్పటికీ గుర్తుండిపోయే జయమాలిని ఐటమ్ సాంగ్స్..!

- Advertisement -

సినిమా అంటే నవరసాలు​ మేళవించిన కళ. అలాంటి సినిమాల్లో ఐటమ్ సాంగ్‌కు కూడా సముచిత స్థానం ఇవ్వడం అవసరం. అక్కర్లేని చోట అతికించినట్టు ఉంటుందన్న విమర్శ ఎలా ఉన్నా, 1960 నుంచి తెలుగు సినిమాల్లో ఐటం సాంగ్స్‌కి విపరీతమైన ఆదరణ ఉందన్న విషయం ఒప్పుకొని తీరాలి. అలాంటి పాటలు పాడేందుకు, నృత్యం చేసేందుకు ప్రత్యేకంగా గాయకులు, నటీమణులు ఉన్నారంటే జనాన్ని ఆ పాటలు ఎంతగా ఆకట్టుకున్నాయో ఊహించుకోవచ్చు. అలాంటి నటుల్లో జయమాలిని గారిది అగ్రస్థానం. దాదాపు 500 సినిమాలకు పైగా నటించిన ఆమె అప్పట్లో పాపులర్ డ్యాన్సర్. ఆమె పాట ఉందంటే ఆ సినిమా తప్పక చూడాలన్న ఆలోచనతో జనం ఉండేవారు. ఆమె నర్తించిన ఐదు ఫేమస్ సాంగ్స్ ఇక్కడ..

నీ ఇల్లు బంగారం గానూ..
ఎన్టీఆర్ హీరోగా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గజదొంగ'(1981) సినిమాలో ఈ పాట తెలుగు జనాలను ఒక ఊపు ఊపింది. శృంగార గీతాల్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఎస్.జానకి అద్భుతమైన గానానికి జయమాలిని వేసిన స్టెప్పులు ఆనాటి కుర్రకారును హోరెత్తించాయి.

సన్నజాజులోయ్..
రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘సింహబలుడు'(1978) సినిమాలో ఈ పాట తెలియని తెలుగు ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. మత్తెక్కించే పాటలకు కేరాఫ్ అడ్రస్ ఎల్.ఆర్.ఈశ్వరి పాడిన పాటకు జయమాలిని నృత్యం అదరహో!

పుట్టింటోళ్లు తరిమేశారు..
రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘వేటగాడు'(1979) సినిమాలో ఈ పాటలో ఎన్టీఆర్‌కు పోటీగా స్టెప్పులు వేసి మైమరిపించారు జయమాలిని. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేంత అద్భుతమైన అభినయం.

గుడివాడ వెళ్లాను..
తాతినేని రామారావు దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘యమగోల'(1977)లోని పాట ఇది. రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య లాంటి నటుల మధ్య జయమాలిని నృత్యం అజరామరం అనిపిస్తుంది. ప్రతి రికార్డింగ్ డాన్సు ట్రూప్‌ ఎక్కడ ప్రోగ్రామ్ చేసినా ఈ పాటకు డ్యాన్స్ వేయాల్సిందే అనేంతగా పాపులర్ అయ్యింది ఈ గీతం.

గుగుగుగు.. గుడిసుంది
ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘డ్రైవర్ రాముడు'(1977) చిత్రంలో పాట ఇది. ఎన్టీఆర్, జయమాలిని చేసిన డ్యాన్స్ చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది.

దర్శక నిర్మాతలు.. నటులైన వేళ!

మాయాబజార్ సినిమాలో​.. భలే భలే టైటిల్స్!

నచ్చిన పాత్రలను మిస్ చేసుకున్న నటీనటులు..!

గుప్పెడన్ని సీన్లు.. చిరకాలం గురుతులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -