Wednesday, May 22, 2024
- Advertisement -

ఆకాశంలో కౌషల్ పాతాళంలో హౌస్ మేట్స్

- Advertisement -

మీరు మారరు. మంచితనం ముసుగు తీయరు. బంధాలు, అనుబంధాలు అంటూ సోది కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయడానికి వచ్చారా ? సరే మీ ఖర్మ. అని బిగ్ బాస్ ప్రేక్షకులు దీప్తి నల్లమోతు, గీతా మాధురి, తనీష్, సామ్రాట్ మీద ట్రోల్స్ చేస్తున్నారు. మీరు తోటి కంటెస్టంట్ల మనసులు గెల్చుకున్నారు కదా. మీ జీవితాల్లో అదే పెద్ద అచీవ్ మెంట్. ఇక పండగ చేస్కోండి. కౌషల్ మాత్రం బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయి, కోట్లమంది ప్రేక్షకుల మనసులు గెల్చుకుని బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడు. అంటూ జోకులేస్తూ మిగతా కంటెస్టంట్ల మీద మైమ్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ 2 ఆఖరి వారంలోకి వచ్చేసింది. వచ్చే ఆదివారం ఫినాలే. ఈ సందర్భంగా క్యాంపెయినింగ్ చేసుకోండి. అని నానీ సూచిస్తే..వీళ్లంతా మళ్లీ సోది కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. హౌసులో జరిగిన సంఘటనలు, తాము ఎదుర్కొన్న సవాళ్లు, ఆడిన ఆట తీరు,తమ కష్టాన్ని గుర్తించి ఓట్లు వేయండి..అని ప్రేక్షకులను రిక్వెస్టు చేసుకోకుండా…నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నా తోటి కంటెస్టెంట్లు అందరూ నా కన్నా మంచివాళ్లు. అంటూ ఆఖరి వారం టైటిల్ విన్నింగ్ రేసులో కూడా వీళ్ల బంధాలు, బంధుత్వాలు, పైత్యాలు ఏంటో అర్ధం కాలేదు ప్రేక్షకులకు. పైగా హౌసు బయట ఎవరేంటి ? అనేది ప్రేక్షకులకు అనవసరం. కేవలం బిగ్ బాస్ హౌసులో జర్నీ చూసి మాత్రమే, వారి ప్రవర్తన, మాట, ఆట, పద్ధతి, వ్యవహారాలను చూసి, నచ్చితేనే ఓట్లు వేస్తారు. అంతేకానీ బిగ్ బాస్ హుసులోకి రాకముందు వారి బాధలేంటి ? కష్టాలేంటి ? ఉద్యోగ వ్యాపారాలు, లాభనష్టాలు, కన్నీళ్లు, సెంటిమెంట్లు చూసి ఓట్లు వేయరు.

అందుకే బిగ్ బాస్ టైటిల్ కోసం తామెంత తపన పడింది. ఎంత కష్టపడి ఫైట్ చేసింది. ప్రతి టాస్కులో విజేతగా నిలవడానికి ఎంత చెమటోడ్చింది. చెప్పుకుని, ప్రేక్షకులను ఓట్లు అడిగితే బాగుండేది. అంతేకానీ హౌసులో 106 రోజుల ప్రయాణంలోని లోటుపాట్లు, కష్టాలు, సవాళ్లు చెప్పుకోవడం కంటే, హౌస్ లోకి రాకముందు తాము పడ్డ బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అమ్మానాన్నల సెంటిమెంట్….అంటూ ఏదేదో చెప్పుకొచ్చారు. ఆఖరి వారం కూడా తోటి కంటెస్టెంట్ల వద్ద బ్యాడ్ అయిపోతామనే భయంతో పక్కా సేఫ్ గేమ్ ఆడారు. నాతో పాటు మిగిలిన వాళ్లంతా మంచివాళ్లే. మా మంచి వాళ్లందరిలో మీకు ఎవరు నచ్చితే, వారికి ఓటు వేయండి. అంటూ సేఫ్ గేమ్ కి పరాకాష్ఠ గేమ్ ఆడారు. వీళ్లు ఐదుగురిలో ఒక్కరే టైటిల్ విన్నర్ కాబోతున్నారు. అంటే మిగిలిన నలుగురుకి ఓట్లు వేయకుండా, కేవలం తనకు మాత్రమే ఓట్లు వేస్తే గెలుస్తారు. కదా, అదే విషయం ప్రేక్షకులను అడగాలి కదా. కానీ తోటి కంటెస్టెంట్ల దగ్గర ఎక్కడ చెడ్డ అయిపోతామో, వాళ్లతో ఫ్రెండ్ షిప్ ఎక్కడ చెడిపోతుందో…! అనే భయంతో కూడిన నటనే వీరిలో కనిపించింది. అందుకే ఆఖరి దశలోనూ ఫేక్ గేమే ఆడారు. దీంతో వీళ్లు మారరు. మార్చాలనుకోవడం బిగ్ బాస్, నానీ, కౌషల్ అమాయకత్వం అని ప్రేక్షకులు మండిపడుతున్నారు. మీ ఖర్మ… ఇంతేలే అని తీసి పారేస్తున్నారు. కౌషల్ మాత్రం తాను ఎంత కష్టపడి టాస్కులు ఆడింది, గెలుపు కోసం ఎంత పరితపించింది కథ రూపంలో ప్రేక్షకులకు చెప్పుకుని మళ్లీ ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లు తన కంటే గొప్పగా ఏమీ ఆడలేదని, అన్ని టాస్కుల్లో తానే కష్టపడ్డానని, ఎక్కువసార్లు నామినేట్ అయినా తనకే ప్రేక్షకుల మద్దతు ఉండబట్టే ఫినాలే వరకూ రాగలిగాననిె చెప్పాడు. ఆఖరి వారం కూడా తనకు ఓట్లు వేసి విజేతగా నిలపాలని కోరి, మరోసారి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -