పుష్ప స్పెషల్ సాంగ్ లో ఊర్వశి..!

- Advertisement -

అల్లు అర్జున్ సుకుమార్ కాంబో వస్తున్న మూడో సినిమా పుష్ప పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఇప్పటికే వీరి కాంబో లో ఆర్య, ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. లాక్ డౌన్ తర్వాత రెండో షెడ్యూల్ షూటింగ్ నవంబర్ 10నుండీ ప్రారంభమయ్యింది. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా కావడంతో మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుగునుంది.

ఈ సినిమాని మైత్రీ మూవీమేకర్స్ తెరకేస్తుండగా.. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అయితే మొదటినుంచి సినిమాలో విలన్ గా తమిళ హీరో విజయ్ సేతుపతి ని అనుకున్నారు కాని డేట్ సమస్య వల్ల ఆయన ఈ సినిమా కి దూరమయ్యారు. తర్వాత అరవింద్ స్వామి ని పెట్టాలనుకున్న ఆయన కూడాఈ సినిమా చేయడానికి సముఖంగా లేకపోవడంతో తెలుగు యంగ్ హీరో నారా రోహిత్ అని కూడా వర్తాలు వచ్చాయి. ఇప్పడు తమిళ నటుడు ఆర్య పేరు పుష్ప సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నా పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఓ లారీ డ్రైవర్ గా కనిపించబోతున్నాడు. అల్లు అర్జున్ సరసన మొదటి హీరోయిన్ గా రష్మిక నటిసుండగా.. సినిమలో స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా ను ఎంపిక చేశారట.

చిట్టిబాబు ను పుష్ప‌రాజ్ మైమ‌రిపిస్తాడా..!

అల్లు అర్జున్ ‘పుష్ప’ లో విలన్ గా తమిళ నటుడు..!

10 ఏళ్ళ తర్వాత మహేష్ తో అనుష్క రొమాన్స్..!

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...