Monday, May 20, 2024
- Advertisement -

బ్రూస్ లీ సెన్సార్ టాక్ ఏంటి…?

- Advertisement -

బ్రూస్ లీ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.దీంతో ఈసినిమా ఎలా వచ్చింది, ఎలా ఉందంటూ సెన్సార్ సభ్యులపై ఒత్తిడి పెరిగిపోతోంది. రకరకాల యాంగిల్స్ లో సెన్సార్ సభ్యులనుంచి సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. మరి ఇంతటి ఒత్తిడి మధ్య బయటకు వచ్చిన…బ్రూస్ లీ  సెన్సార్ టాక్ ఏమై ఉంటుందా అని చాలామంది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

దసరా రేసులో ఈ చిత్రం నిలవడంతో బ్రూస్ లీ గురించి ఉత్కంట జనాల్లో మరీ ఎక్కువైంది.అధికారులు కూడా ఈ చిత్రం చూశాక….పెద్దగా కట్స్ అంటూ ఏమి చెప్పకుండా యూ/ఎ సర్టిఫికేట్ ఇచ్చారు.ఐతే ఈ సినిమాను చూసిన

 సెన్సార్ సభ్యులు శ్రీను వైట్ల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక విషయమై ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. జనరల్ గా శ్రీనువైట్ల సినిమాల నిడివి..ఎప్పుడూ  ఎక్కువగానే ఉంటుంది. ‘దూకుడు’, ‘బాద్ షా’, ‘ఆగడు’ లాంటి సినిమాలు అన్నింటినీ శ్రీనువైట్ల కాస్త లెంతీగా తీసాడు. ఐతే ఈ పద్ధతికి విరుద్ధoగా ఫస్ట్ టైమ్ ‘బ్రూస్ లీ’ సినిమాను కేవలం 2గంటల 26 నిమిషాల నిడివితో చిన్న వ్యవధి సినిమాగా  తీయడం…. సెన్సార్ బోర్డు సభ్యులను ఆలోచించేలా చేసింది.దీనికి మెగా కంట్రోల్ ఉండడమే కారణంగా కనిపిస్తుంది.

ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యుల నుండి బయటకు లీక్ అయిన సమాచారం మేరకు శ్రీనువైట్ల స్క్రీన్ ప్లే ఈ సినిమాకు హైలైట్ అంటున్నారు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా టెర్రిఫిక్ గా తయారైందని సమాచారం.బ్రూస్ లీ ఫస్ట్ హాఫ్ లో ఉండే  రకుల్ తో వచ్చే రొమాన్స్…. సినిమాకు యూత్ ఆడియన్స్ రిపీట్ అయ్యేలా చేస్తుందట.ఇక పాటలు కూడా పిక్చరైజేషన్ పరంగా చూస్తే…మెస్మరైజ్ చేస్తుందంటున్నారు.

  అలాగే సినిమాలో ఉండే శ్రీనువైట్ల,కోన వెంకట్ అండ్ టీం  కామెడీ…. ప్రేక్షకులను గిలిగింతలు పెట్టడమే కాకుండా కడుపు చెక్కలయ్యేలా అలరిస్తుందని చెబుతున్నారు. అలాగే  ఈసినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని ట్విస్టులు….. ఊహించని విధంగా ఉంటాయని చెబుతున్నారు.దీని గురించే ..కోన వెంకట్ అండ్ టీంను శ్రీనువైట్లతో కలిపించాడని కూడా చెబుతున్నారు.ఇక మన అన్నయ్య చిరంజీవి స్పెషల్ రోల్ దాదాపు 4 నుంచి 5 నిమిషాల సేపు  ఉంటుందట.టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేయాలని కలలు కంటున్నా చరణ్ కలలకు ప్రేక్షకులు ఇచ్చే తీర్పు గురించి అందరూ ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -