Sunday, May 19, 2024
- Advertisement -

సుకుమార్ సినిమాలు అన్నింటిలో ఆ పాయింట్ మాత్రం కామన్‌గా ఉంటోందా?

- Advertisement -

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న టాప్ డైరెక్టర్స్ అందరూ కొత్త కొత్త సినిమాలు తీస్తున్నాం అని చెప్తూ ఉంటారు కానీ అన్ని సినిమాల్లోనూ కొన్ని ఎమోషన్స్ మాత్రం ఎప్పుడూ పాతగానే ఉంటున్నాయి. రాజమౌళి సినిమాలు అన్నింటినీ పరిశీలిస్తే…..ఒక అతిపెద్ద విలన్……ఆ స్థాయిలో బలం లేని హీరో…..ఆ అతిపెద్ద విలన్‌తో ఎలా ఫైట్ చేశాడనేది కథగా ఉంటూ వస్తూ ఉంది. ఈగ సినిమాలో కూడా సేం టు సేం అదే కథ. కాకపోతే హీరో మాత్రం మరీ చిన్నవాడు అనేదే తేడా. ఇక మిగతాసినిమాలన్నీ కూడా అదే ఫార్ములా. ఇక శ్రీనువైట్ల, బోయపాటి శ్రీనులాంటి వాళ్ళ సినిమాలు అయితే చెప్పనవసరం లేదు. అంతా అదే మసాలా. టాలెంటెడ్ రైటర్ అని పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అత్తారింటికి దారేది సినిమా నుంచీ ఒకే మూస ఫార్ములా ఫాలో అవుతున్నాడు. రెండు మూడు ఫ్లాష్ బ్యాక్ బిట్స్ పెట్టుకుని సినిమా కథనం నడిపిస్తున్నాడు.

ఇక ఇప్పుడు సుకుమార్ కూడా రివేంజ్ ఫార్మాట్ సినిమాలకు పరిమితమయిపోతున్నాడా అని సినీ క్రిటిక్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ లాంటి సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ ఒక జానర్‌కి పరిమితమవడాన్ని సినిమాను ప్రేమించే ఎవ్వరూ ఇష్టపడరు. అయితే సుకుమార్ మాత్రం 1….నేనొక్కడినే, నాన్నకుప్రేమతో, రంగస్థలం సినిమాలలో ఒకే తరహా రివేంజ్ ఫార్ములాను నమ్ముకున్నాడు. మొదటి రెండు సినిమాల్లో తండ్రికి అన్యాయం చేసినవాడిపై హీరో రివేంజ్ అయితే………ఇప్పుడు రంగస్థలంలో అన్నకు అన్యాయం చేసినవాడిపై రివేంజ్ తీర్చుకోవడం కథ. తర్వాత తీయబోయే కొత్త సినిమాలోనైనా రివేంజ్ ఫార్ములా కాకుండా ఏదైనా సరికొత్త కొథతో సుకుమార్ మన ముందుకు రావాలని కోరుకుందాం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -