Tuesday, May 21, 2024
- Advertisement -

వెయ్యి కోట్లతో భారీ చిత్రాలు!

- Advertisement -

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ బ్యానర్స్ నిర్మిస్తుండగా ఈ సినిమాతో పాటు పలు సినిమాలు నిర్మించేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఏకంగా రూ.925 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నాయి. ఇక ఇళయరాజా బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025లో రిలీజ్ కానుంది.

ఇక ఈ రెండు నిర్మాణ సంస్థలు రాబోయే మూడు సంవత్సరాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునేలా మెగా-బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాయి. దీనిని ఇలంపరితి గజేంద్రన్ ముందుండి నడిపించనున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. దీనిని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున సినిమాలు నిర్మించనున్నాయి ఈ రెండు నిర్మాణ సంస్థలు.

కనెక్ట్ మీడియా వరుణ్ మాథుర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమ కీలక దశలో ఉందని..రాబోయే రెండు సంవత్సరాల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం అన్నారు.

కనెక్ట్ మీడియా దేశంలోని మొట్టమొదటి పాన్-ఇండియా ఫిల్మ్ స్టూడియో, బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక మెర్క్యూరి…భారతదేశంతో పాటు అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు, యూరప్‌లో కన్సల్టింగ్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో వ్యాపారం చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -