Sunday, May 5, 2024
- Advertisement -

పెళ్లి చూపులు మూవీ రివ్యూ!

- Advertisement -

సినిమా పోస్టర్లతో , ట్రైలర్ లతో ఆసక్తిని రేపిన సినిమా పెళ్లి చూపులు. సినిమా కంటెంట్ బాగుండడం తో సురేష్ బాబు కి అమ్మేసారు అసలైన ప్రొడ్యూసర్ లు. ఈ సినిమా చిన్న చిత్రాలు ఎలాంటి ఆసక్తిని రేపగలవు అనే విషయం లో అతిపెద్ద ఉదాహరణ అని చెప్పచ్చు. హీరో హీరోయిన్ ఎవరో కూడా తెలీకుండా రిఫ్రెషింగ్ లుక్ తో వచ్చిన పెళ్లి చూపులు ఎలా ఉందొ చూద్దాం రండి.

కథ – పాజిటివ్ లు :

 ప్రశాంత్ (విజయ్ దేవరకొండ).. సరదాగా కాలం వెళ్ళదీసే ఈతరం ఆలోచనలున్న ఓ యువకుడు. తన ఆలోచనలకు తగ్గట్టుగా ప్రశాంత్ ఓ చెఫ్‌గా పనిచేయాలని కోరుకుంటూ ఉంటాడు. ఇక జీవితం పట్ల ఎటువంటి స్పష్టత లేనట్లు కనిపించే అతడికి పెళ్ళి చేస్తే అయినా అన్నీ కుదురుతాయని చిత్ర (రీతూ వర్మ) అనే అమ్మాయితో అతడి తండ్రి పెళ్ళి నిశ్చయిస్తాడు. అయితే చిత్ర మాత్రం తనకు పెళ్ళి ఇష్టం లేదని, ఫుడ్ ట్రక్ బిజినెస్ పెట్టాలన్నది తన కలని పెళ్ళిని నిరాకరిస్తుంది. ఈ క్రమంలోనే ప్రశాంత్ వేరొక అమ్మాయితో పెళ్ళి ప్రయత్నాలు చేస్తుండగా, వాళ్ళ దగ్గర్నుంచి కూడా ప్రశాంత్‌కి కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి. వాటిని ఎదుర్కునేందుకే చిత్రతో కలిసి ప్రశాంత్ ఫుడ్ ట్రక్ బిజినెస్ మొదలుపెడతాడు. రెండు వేర్వేరు ఆలోచనలున్న ఈ ఇద్దరి ప్రయాణం ఆ తర్వాత ఏయే మలుపులు తిరిగిందీ? చివరకు వీరి కథ ఎక్కడివరకు వచ్చిందీ? అన్నదే సినిమా. ఈ సినిమాలో కథ తో పాటు కథనం కూడా చాలా కొత్తగా ఉండడం విశేషం. ఈ తరం భావోద్వేగాలు పెర్ఫెక్ట్ గా సింక్ చేసాడు డైరెక్టర్ . విభిన్న మనస్తత్వాలతో కొట్టుకుపోతున్న ఈ తరం లో ఏ అబ్బాయి కి ఎలాంటి అమ్మాయి కావాలి ఏ అమ్మాయి కి ఎలాంటి అబ్బాయి కావాలి అనే కథనం తో సినిమా సాగుతుంది, ప్రతీ పాత్రకీ అర్ధం తీసుకొస్తూ అందరికీ సరిగ్గా ముగింపు పలికాడు. విజయ్ దేవరకొండ తన పాత్రలో అద్భుతంగా నటించాడు. అతడికిది రెండో సినిమాయే అంటే ఎక్కడా నమ్మలేనంతగా తన పాత్రలో ఒదిగిపోయి నటించేశాడు. రీతూ వర్మతో విజయ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఇక ఒక స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిగా రీతూ వర్మ తన నటనతో కట్టిపడేసింది. క్యాస్టిక్ పరంగా సినిమాకు రీతూను ఓ మేజర్ పిల్లర్‌గా చెప్పొచ్చు. ఇక మిగతా సపోర్టింగ్ నటులంతా చాలా బాగా నటించారు. దర్శకుడు అనీష్ కురివెల్లకు కూడా నటుడిగా మంచి మార్కులు వేయొచ్చు.

నెగెటివ్ లు :

 ఈ సినిమా కి కథ ముందే తెలిసిపోయేలా ఉండడం ఈ సినిమాకి అతిపెద్ద మైనస్ పాయింట్. సెకండ్ హాఫ్ చాలా స్లో గా సాగుతుంది. రెగ్యులర్ కథలకి అసలు స్కోప్ లేకుండా సాగడం తో కమర్షియల్ సినిమాలు ఇష్టపడేవారికి ఈ సినిమా మింగుడు పడ్డం కష్టం. ఇంతకంటే నెగెటివ్ లు ఈ సినిమాలో కనపడవు.

మొత్తంగా : 

పెళ్లి చూపులు అనే టైటిల్ ఎంత ఫ్రెష్ గా పెట్టారో సినిమా కూడా అంతే ఫ్రెష్ గా సాగస్తాడు డైరెక్టర్. మొదటి నుంచే బ్యూటిఫుల్ గా నడిపిన కథని అంతే అందంగా ముగించాడు. సినిమాటోగ్రఫీ తో అబ్బుర పరుస్తారు. ప్రేమ పెళ్లి కెరీర్ ఈ మూడింటినీ ఈ తరం కుర్రకారు ఏ రకంగా హ్యాండిల్ చేస్తోంది, చెయ్యాలి అనేవి ఈ సినిమాలో చూపించారు. అనవసర హీరోయిజం , అక్కరలేని కామెడీ, సిల్లీ ఫైట్ లూ లేకుండా ఆద్యంతం వినోదబరితంగా అదే సమయం లో ఆలోచింపజేసేలగా తీసారు ఈ సినిమాని. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రతిభ ప్రతీ ఫ్రేం లో కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కాస్త నెమ్మదిగా ఉంటుంది అంతే తప్ప సినిమా యావత్తూ కనక్ట్ అయ్యే విధంగానే ఉంటుంది ఈ చిత్రం.

మూవీ రేటింగ్: 3.5/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -