Thursday, May 16, 2024
- Advertisement -

ఎక్స్‌ప్రెస్ రాజా మూవీ రివ్యూ

- Advertisement -

కొత్త రకం సినిమాలు తీయడంలో శర్వనంద్ ఎప్పుడు ముందు ఉంటాడు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వంటి సినిమా తీసిన దర్శకుడు మేర్లపాక గాంధీ తో కలిసి ఈ శర్వనంద్  ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ గా ముందుకు వచ్చాడు. వరసగా హిట్స్ కొడుతున్న శర్వాకి ఈ సినిమా ఎలాంటి ఫలితం ఇచ్చిందో చూద్దాం 

కథ :

అల్లరిగా ఏం పని లెకుండా తీరుగుతుంటాడు రాజా(శర్వనంద్). రాజ తండ్రి మంచి పనులు చేస్తు సమాజంలో మంచి పేరు ఉన్న వ్యక్తి. అయిన రాజా అలంటివి ఏం పటిచుకోకుంటా అల్లరిగా తీరుగుతుంటాడు. అనుకోకుండా ఓ రోజు అమ్ము (సురభి) అనే అమ్మాయిని చూసి ఇష్టపడుతాడు. తొలి చూపులనే ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు. తను ప్రేమించిన అమ్ము కోసం ఓ స్నూపీ అనే కుక్క పిల్లాను కిడ్నాప్ చేయాల్సి వస్తుంది. ఆ తరువాత  బ్రిటీష్ (సుప్రీత్), ఇనుము (ధన్‍రాజ్), మావయ్య శీను (ప్రభాస్ శీను), పొల్యూషన్ గిరి (సప్తగిరి), బిల్‌గేట్స్ (బ్రహ్మాజీ), వసంత కోకిల (ఊర్వశి), నటరాజ్ (షకలక శంకర్) పాత్రలు కథలోకి ప్రవేసిస్తాయి. ఇంతకి రాజా స్నూపీని ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది? రాజా, అమ్ముల ప్రేమ ఏం అయింది? అనే విషాయలు తెలియలి అంటే సినిమా చూడాల్సిందే.

 

పాజిటివ్స్: 

ఈ సినిమాలో ముందు చేప్పుకోవాల్సింది శర్వనందు, దర్శకుడు గాంధీల గురించి. శర్వ నంద్ నటన పరంగా కాని కామీడి టైమిగ్ లోను అద్భుతమైన నటన కనబరిచి అందరిని మెప్పించాడు. ఇక దర్శకుడు మేర్లపాక గాంధీ తన మొదటి సినిమాతోనే నిరుపించుకున్నాడు తనలో టాలెంట్ ఉంది అని. ఈ సినిమాలో కామెడీ సీన్స్ చాలా బాగా తెరకేక్కించాడు. సినిమా నిండా కామిడి పెట్టి తెగ నవ్వించాడు. ఇక సినిమాలో అన్ని పాత్రలు చాలా కొత్తగా ఉంటాయి. కథ మాములుగా ఉన్న కథనం బాగుండటంతో చూసే ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు. ఇక సుప్రీత్, ప్రభాస్ శీను, బ్రహ్మాజీ, ధన్‌రాజ్ షకలక శంకర్ తదితర నటులు తమ వంతు కామెడీ చేసి నవ్వించారు. ఇక హీరోయిన్ అమ్ము పాత్రకి పెద్దగా స్కోప్ లేకపోయిన పరవలేదు అనిపించింది. సంగీతం పరవలేదు అనిపిచింది. కథలో దమ్ములెక పోయిన దర్శకుడు కథనంతో సినిమా నడిపిచాడు. కామెడీని ఇష్టపడే వారు ఈ సినిమా చూడవచ్చు. 

 

నెగిటివ్స్:

ఈ సినిమాలో మేజర్ మిస్స్ అయినది అంటే కథ విషయంలో. కథపై ఇంక కాస్తా దృష్టి పెడితే బాగుండేది. కొన్ని సిన్స్ అక్కడాక్కడ బోర్ కొట్టిస్తాయి. ఇక హీరో, హీరోయిన్‍ల మధ్య లవ్ ట్రాక్ అంతా ఇంట్రేస్టింగ్ గా ఉండదు.  ఈ ఇద్దరి మధ్య లవ్ మంచిగా పండించి ఉంటే బాగుండేది. అల్లరిగా తిరిగే రాజా ఒకే సారి మంచి వాడిలా నటించడం కొంచెం రొటీన్‌గా అనిపిస్తుంది.

 

మొత్తంగా: 

కామిడీ ఉంటే ప్రేక్షకుడు ఖచ్చితంగా ఆదరిసిస్తాడు అని ఈ సినిమా చూసి చేప్పవచ్చు. ప్రతి సన్నివేశంలో కామిడీ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అది చాలా ప్లేస్ అయింది. రోటిన్ సినిమాలు చూసే వారికి ఇది ఓ కొత్త సినిమా అని చెప్పవచ్చు. కథ గురించి, యాక్షన్ సిన్స్ గురించి అలోచించకుండా జెస్ట్ నవ్వుకోవడానికి ఈ సినిమాకి వేళ్ళోచ్చు. చాలా మంది కామిడీయన్లు ఈ సినిమాలో నటించడంతో సినిమా నిండా కామిడీతో నింపెసిండు దర్శకుడు. ఇక హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ మీద ఇంక కాస్తా దృష్టి పెడితే బాగుంటుండే. చివరిగా చెప్పాలి అంటే మంచి కామెడీ ఉంటే చాలు అనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -