Thursday, May 16, 2024
- Advertisement -

ఫస్ట్ రాంక్ రాజు సినిమా రివ్యూ

- Advertisement -

సినిమా : ఫస్ట్ రాంక్ రాజు
విడుదల తేదీ : జూన్ 21, 2019
నటీనటులు : చేతన్‌ మద్దినేని, కౌశిక్‌ ఓరా, సీనియర్ నరేష్, పోసాని త‌దిత‌రులు.
దర్శకత్వం : నరేష్‌ కుమార్‌
నిర్మాత : మంజునాధ్‌ వి. కందుకూర్‌
సంగీతం : కిరణ్ రవీంద్రనాధ్
సినిమాటోగ్రఫర్ : శేఖర్ చంద్రు

రాజు (చేతన్ మద్దినేని) చిన్నప్పటినుంచి లోక జ్ఞానం కంటే పుస్తక జ్ఞానం చాలా గొప్పది అని అనుకుంటూ పెరుగుతాడు. ఎప్పుడూ తన తల్లిదండ్రులు (నరేష్, రాజశ్రీ నాయర్) మాట వింటూ ప్రతి క్లాసులోనూ ఫస్ట్ వస్తూ ఫస్ట్ రాంక్ రాజు గా మారిపోతాడు. రాజుకి విద్య 100% ఉన్నప్పటికీ బుద్ధి మాత్రం జీరో పర్సెంట్ ఉంటుంది. దీంతో బయటికెళ్ళి కూరగాయలు కొనడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతాడు. ఆఖరికి తనను తను ప్రేమించిన హీరోయిన్ (కశిష్ వోహ్రా) ని కూడా దూరం చేసుకుంటాడు. ఎంత టాపర్ అయినప్పటికీ తాను కోరుకున్న టాప్ ఎమ్. ఎన్. సి లో తనకు జాబ్ దొరకదు. దీంతో రాజు కి ఎదురు దెబ్బ తగులుతుంది. ఇక ఎలాగైనా లోకజ్ఞానం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంటాడు రాజు. ఫస్ట్ రాంక్ రాజు మామూలు రాజుగా ఎలా మారతాడు? చివరికి ఏమైంది అనేదే ఈ సినిమా కథ.

నటీనటులు:
చేతన్ మద్దినేని ఈ సినిమాలో మంచి నటనను కనబరిచాడు. ‘రోజులు మారాయి’ సినిమా తో పోలిస్తే ఈ సినిమాలో డైలాగ్ డెలివరీ మరియు ముఖకవళికల పైన బాగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాతో చేతన్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన చాలా బాగుంది. కషిష్ వోహ్రా ఈ సినిమాలో తన అందంతో మాత్రమే కాక తన నటనతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. చేతన్ తో మంచి కెమిస్ట్రీ ని మెయింటైన్ చేసింది. వీరిద్దరి మధ్య సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సీనియర్ నటులు నరేష్, ప్రకాష్ రాజ్ తమ అద్భుతమైన నటనతో సినిమాకి మరింత బలం చేకూర్చారు. ప్రియదర్శి, వెన్నెలకిషోర్, బ్రహ్మానందం తదితరులు కచ్చితంగా ప్రేక్షకులను నవ్వు తెప్పిస్తారు. పోసాని కృష్ణమురళి ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకు మరింత ప్లస్ అయింది. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:
దర్శకుడు నరేష్ కుమార్ హెచ్ ఎన్ ఈ సినిమా కోసం మంచి కథను సిద్ధం చేసుకున్నారు. దానిని ఆసక్తికరమైన విధంగా నెరేట్ చేశారు కూడా. మంచి కథ ఉండటం ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. దర్శకుడు ఆ కథను తెరకెక్కించిన విధానం కూడా ఖచ్చితంగా అందరినీ మెప్పించే విధంగా ఉంది. మంజునాథ్ వి కందుకూర్ అందించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ గ్రాండ్ విజువల్స్ ను అందించారు. కిరణ్ రవీంద్రనాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని చేకూర్చింది. ఒకటి రెండు పాటలు మాత్రమే కాక ఆ సినిమాలోని నేపథ్య సంగీతం కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ శేఖర్ చంద్ర ఈ సినిమాకు మంచి విజువల్స్ అందించారు. గిరి మహేష్ ఎడిటింగ్ బాగుంది.

తీర్పు:
కన్నడ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాని చాలా బాగా తెరకెక్కించారు. ఈ సినిమాతో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టం పైన సెటైర్లు కూడా వేశారని చెప్పవచ్చు. పిల్లలు ఎప్పుడూ చదువులో ముందుండాలి, క్లాస్ ఫస్ట్ రావాలి లేకపోతే వారి జీవితం నాశనం అయిపోతుంది అని భయపడే తల్లిదండ్రులు, వాళ్ల ప్రెజర్ తట్టుకోలేని స్టూడెంట్స్ గురించి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. సెన్సిటివ్ పాయింట్ ను తీసుకున్నప్పటికీ దర్శకుడు దానిని చాలా బాగా తెరకెక్కించారు. మంచి మెసేజ్ ఉన్న కథ అయినప్పటికీ దర్శకుడు సినిమా మొత్తం సినిమా ఎంటర్టైనింగ్ గా ఉండేలా చూసారు. చివరిగా ‘ఫస్ట్ రాంక్ రాజు’ స్టూడెంట్స్ మాత్రమే కాదు వారి తల్లిదండ్రులు కూడా హ్యాపీగా చూడదగ్గ సినిమా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -