Tuesday, May 21, 2024
- Advertisement -

‘గీతా గోవిందం’ మూవీ రివ్యూ

- Advertisement -

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోగా మారిపోయాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.ఈ సినిమా త‌రువాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు యూత్‌లో బాగా ఫాలోయింగ్ పెరిగింది.విజ‌య్ దేవ‌ర‌కొండ తాజా చిత్రం గీతా గోవిందం ఈ సినిమా ఈ రోజే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఓ డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు .విజ‌య్ దేవ‌ర‌కొండ. మరి తన ఇమేజ్‌కు పూర్తి భిన్నంగా విజయ్‌ చేసిన గీత గోవిందం ఎలా ఉందో స‌మీక్ష ద్వారా తెలుసుకుందాం.

కథ :
విజయ్‌ గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) లెక్చరర్‌. చిన్నప్పటి నుంచి చాంగటి కోటేశ్వరరావుగారి ప్రవచనాలు విని పెరిగిన పద్ధతి గల కుర్రాడు. తను చేసుకోబోయే అమ్మాయి కూడా సాంప్రదాయబద్ధంగా, తన అమ్మలాగే ఉండాలని కలలు కంటుంటాడు. అలా ఓ అమ్మాయి వెంటే 6 నెలలు తిరిగిన తరువాత ఆ అమ్మాయికి పెళ్లయిందని తెలిసి నిరుత్సాహపడతాడు. కొద్ది రోజులకు గీత (రష్మిక మందన్న)ను గుడిలో చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. ఎలాగైన ఆ అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తన చెల్లికి పెళ్లి కుదరటంతో కాకినాడ బయలుదేరుతాడు విజయ్‌. గీత కూడా అదే బస్సులో విజయ్‌ పక్కన సీటులోనే కూర్చుంటుంది. ఎలాగైనా ప్రేమ విషయం చెప్పాలనుకున్న విజయ్‌, ఫ్రెండ్స్‌ చెప్పిన చెత్త సలహాల కారణంగా ఆమె దృష్టిలో ఓ రోగ్‌ అనిపించుకుంటాడు. అలా గీతకు దూరమైన విజయ్‌ తిరిగి ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
సినిమాపై ఈ స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అవ్వడానికి ముఖ్య కారణం విజయ్‌ దేవరకొండ. అర్జున్‌ రెడ్డి సినిమాలో తన యాటిట్యూడ్‌తో ప్రేక్షకులను ఫిదా చేసిన విజయ్, ఈ సినిమాలో పూర్తి కాంట్రాస్ట్‌ క్యారెక్టర్‌లో కనిపించాడు. భయస్తుడిలా హీరోయిన్‌ చుట్టూ మేడమ్‌..మేడమ్‌ అంటూ తిరిగి పాత్రలో విజయ్ నటన సూపర్బ్‌. ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టించే ఎమోషన్స్‌ను పండించాడు. హీరోయిన్‌ గా రష్మిక మరోసారి వావ్‌ అనిపించారు. ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ గీత పాత్రలో మరింత చేరువయ్యారు. కోపం, ప్రేమ, బాధ ఇలా అన్ని వేరియేషన్స్‌ అద్భుతంగా పలికించారు. చాలా సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతో పోటి పడి నటించారు.

విశ్లేషణ:
సోలో, శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న పరశురామ్‌. మరోసారి తనదైన కామెడీ, ఎమోషనల్‌ టేకింగ్‌తో ఆకట్టుకున్నాడు. పాత కథే అయినా.. కథనం డైలాగ్స్‌తో ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్‌ను అందించాడు. విజయ్‌ దేవరకొండను అర్జున్‌ రెడ్డి ఇమేజ్‌ నుంచి బయటకు తీసుకువచ్చి డిఫరెంట్‌ స్టైల్‌లో చూపించటంలో సక్సెస్‌ అయ్యాడు. దర్శకుడిగానే కాదు రచయితగాను ఫుల్‌ మార్క్స్‌ సాధించాడు. ఎమోషనల్‌ సీన్స్‌ కాస్త సాగదీసినట్టుగా అనిపించినా.. తరువాత వచ్చే ఎం‍టర్‌టైన్మెంట్‌తో అన్ని కవర్‌ అయిపోతాయి. సినిమాకు మరో మేజర్‌ ప్లస్‌ పాయింట్ గోపిసుందర్‌ సంగీతం. కథ భాగంగా వచ్చిపోయే పాటలు ఆడియన్‌ను మరింతగా క్యారెక్టర్స్‌తో కనెక్ట్ చేసేస్తాయి. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్‌, నిర్మాణ విలువలు ఇలా సినిమా స్థాయికి తగ్గట్టుగా సరిగ్గా కుదిరాయి.

బోట‌మ్ లైన్ :
మ‌రో హిట్ కొట్టిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -