Saturday, May 18, 2024
- Advertisement -

వ‌ర్మ‌, మియాల‌కు కోర్టు నోటీసులు…

- Advertisement -

అమెరికన్ పోర్న్ స్టార్ మియా మాల్కోవా ప్రధాన పాత్రలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈసినిమా ప‌లు వివాదాస్పాదాలకు దారి తీసింది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి జనవరి 16న విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో ఓ ఊపుఊపింది.

అయితే తాజాగా జీఎస్టీ స్క్రిప్ట్ తనదేనంటూ గత కొద్దిరోజులుగా ఆరోపిస్తున్న ఓ వ్యక్తి ఇప్పుడు కోర్టుకెక్కారు. ఆయనెవరో కాదు వర్మ ‘సర్కార్ 3’ చిత్రానికి స్టోరీ రైటర్‌గా పనిచేసిన పి.జయకుమార్. జీఎస్టీ కథ తనదేనని, దాన్ని వర్మ కాపీ కొట్టి సినిమా తీసేశారని ఆయ‌న ఆరోపిస్తున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు రాంగోపాల్ వర్మ (ఆర్ కంపెనీ), మియా మాల్కోవా (యూట్యూబ్, వీమియో)కు నోటీసులు పంపింది.

2015 ఏప్రిల్ 1న ఈ స్క్రిప్టును తాను రాంగోపాల్ వర్మకు పంపానని జయకుమార్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాజాగా వచ్చిన ‘గాడ్, సెక్స్ అండ్ ట్రూత్’ ట్రైలర్ చూసి షాక్ అయ్యానని, తన స్క్రిప్టును గుడ్డిగా కాపీ కొట్టారని ఆరోపించారు. ట్రైలర్ మియా మాల్కోవా మాట్లాడిన ప్రతి అక్షరం తన స్క్రిప్టులోదేనని జయకుమార్ వాదిస్తున్నారు. మ‌రి దీనిపై వ‌ర్మ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -