Saturday, May 18, 2024
- Advertisement -

‘జంబ లకిడి పంబ’ రివ్యూ

- Advertisement -

న‌టుడు శ్రీనివాస రెడ్డి మంచి క‌థ‌ల‌ను ఎంచుకుంటు అప్పుడప్పుడు హీరోగా కొన్ని సినిమాలు చేస్తున్నాడు.1993లో సూపర్‌ హిట్ క్లాసిక్‌ జంబ లకిడి పంబ సినిమాను రీమేక్ చేసి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
వరుణ్‌ (శ్రీనివాస్‌ రెడ్డి), పల్లవి (సిద్ధి ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట. పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఇక కలిసి జీవించలేం అని నిర్ణయించుకున్న వరుణ్‌, పల్లవిలు విడాకుల తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. 99 జంటలకు విడాకులు ఇప్పించిన ఫేమస్‌ లాయర్‌ హరిశ్చంద్ర ప్రసాద్‌ (పోసాని కృష్ణమురళీ) వీరికి విడాకులు ఇప్పించి వంద మందికి విడాకులు ఇప్పించిన లాయర్‌ గా గిన్నిస్‌ రికార్డ్ సాధించాలనుకుంటాడు.వరుణ్‌ శరీరంలోకి పల్లవి ఆత్మను, పల్లవి శరీరంలోకి వరుణ్‌ ఆత్మని ఎందుకు మార్చాల్సి వచ్చింది..? చివరకు వరుణ్‌, పల్లవిలు ఒక్కటయ్యారా..? లేదా..? అన్నదే మిగతా కథ.

నటీనటులు :
కమెడియన్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటన కనబరించారు.సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి. ఇతర నటీనటులకు పెద్దగా చెప్పుకోదగ్గ పాత్రలు దక్కలేదు.

విశ్లేషణ :
జంబ లకిడి పంబ లాంటి క్లాసిక్‌ను టచ్‌ చేసే ధైర్యం చేసిన దర్శకుడు మురళీ కృష్ణ ఆ స్థాయిలో అలరించటంలో ఫెయిల్‌ అయ్యారు. ముఖ్యంగా ఫస్ట్‌ హాఫ్‌లో హీరో హీరోయిన్ల మధ్య జరిగే గొడవలు ఏ మాత్రం ఆసక్తికరంగా లేకుండా టీవీ సీరియల్‌ సాగటం ప్రేక్షకులను విసిగిస్తుంది. హీరో హీరోయిన్ల శరీరాలు మారిన తరువాత కూడా కథనం ఆసక్తికరంగా సాగలేదు. గోపి సుందర్ సంగీతం పరవాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

బోట‌మ్ లైన్ : ఇ.వి.వి. లేరు కాబ‌ట్టే ఈ సినిమా తీసే ధైర్య చేశారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -