Sunday, May 19, 2024
- Advertisement -

జయ జానకి నాయక మూవీ రివ్యూ

- Advertisement -

‘సరైనోడు’ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన సినిమా ‘జయ జానకి నాయక’. సాయి శ్రీనివాస్, రకుల్ ప్రీత్‌సింగ్, జగపతి బాబు, ప్రగ్యాజైస్వాల్, శరత్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయింది. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సాయి శ్రీనివాస్‌కు ‘జయ జానకి నాయక’తో దర్శకుడు బోయపాటి మాసివ్ హిట్ ఇచ్చాడో లేదో చూద్దాం..

కథ :

ప్రముఖ వ్యాపారవేత్త చక్రవర్తి(శరత్ కుమార్) కు ఇద్దరు కొడుకులు నందు, గగన్(సాయి శ్రీనివాస్). తండ్రి కొడుకుల్లా కాకుండా ఫ్రెండ్స్ లా ఉంటారు. ఓ సంఘటన ద్వారా గగన్ జీవితంలోకి స్వీటీ (రకుల్) ఎంట్రీ ఇస్తుంది. అశ్విత్ నారాయణ వర్మ (జగపతి బాబు) పరువు కోసం పాకులాడే వ్యక్తి. అనుకోకుండా స్వీటీ పెళ్లి అశ్విత్ నారాయణ వర్మ కొడుకుతో జరుగుతుంది. ఆ పెళ్లి కొడుకును పవర్ చంపేస్తాడు. అసలు ఆ పవర్ ఎవరు..? అశ్విత్ కు పవర్ కి ఏంటి లింక్..? గగన్ ఫ్యామిలీ కి స్వీటీకి ఏంటి లింక్..? చివరికి ఏం జరిగింది..? అనేది మిగితా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో ప్రధాన తారాగణం అంత తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో సాయి శ్రీనివాస్ ఈ సినిమాలో నటన పరంగా మరో ఎత్తు ఎదిగాడు. మొన్నటివరకు డాన్సింగ్‌లో మార్కులు దక్కించుకున్న శ్రీనివాస్.. ఇందులో డాన్స్‌తో పాటు యాక్షన్, ఎమోషన్స్ విషయంలో మంచి మార్కులు దక్కించుకున్నాడు. యాక్షన్ స్టంట్స్ ఎపిసోడ్స్‌లో దుమ్మురేపేసాడు. ఇక ఎమోషనల్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ సీన్లలో కూడా శ్రీనివాస్ నటన బాగుంది. ప్రధానంగా సెకండాఫ్ లో సాయి శ్రీనివాస్ తన యాక్టింగ్‌తో కట్టిపడేసాడు. ఇక రకుల్ ప్రీత్‌సింగ్ తన పాత్రలో ఒదిగిపోయింది. మోషనల్, సెంటిమెంట్ సీన్లలో ఆకట్టుకుంది. సాయిశ్రీనివాస్-రకుల్‌ల మధ్య వచ్చే సీన్లు బాగున్నాయి. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక నెగెటివ్ పాత్రలో జగపతి బాబు మరోసారి తన విశ్వరూపం ప్రదర్శించాడు. నటుడిగా తన పాత్రలో జగపతి ఒదిగిపోయాడని చెప్పుకోవచ్చు. అలాగే శరత్ కుమార్, వాణీ విశ్వనాథ్, నందు, ప్రగ్యాజైస్వాల్ తదితరులు వారి వారి పాత్రలలో బాగా చేసారు. ప్రగ్యాజైస్వాల్ గ్లామర్ పరంగా బాగా ఆకట్టుకుంది. క్యాథెరిన్ స్పెషల్ సాంగ్ బాగుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎక్కువ అయ్యాయి. కానీ సినిమా మొత్తం బాగా స్లోగా సాగుతుంది. సినిమా చూస్తున్నంత సేపు సీరియల్ చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. స్లోగ వెళ్లడం మైనస్. బోయపాటి డైరెక్షన్ సరైనోడు రెంజ్ లో లేదు. తను అనుకున్న ఎమోషన్ ను సరిగ్గా చూపించలేకపోయాడు. ఎడిటింగ్ అస్సలు బాగోలేదు. కథ లో దమ్ము లేదు.

మొత్తంగా : కమర్షియల్ ఎలెమెంట్స్ తో నిండిన సినిమాలు చూసేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -