Thursday, April 18, 2024
- Advertisement -

మీరు పొగతాగుతారా..? అయితే మీ పిల్లలు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయి

- Advertisement -

‘పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం’ అంటూ సిగరేట్ తాగేవారికి ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నాయి. ఆఖరికి సిగరేట్ ప్యాకెట్ పైన కూడా ‘ఇది తాగితే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ’ చెప్పినా.. సిగరేట్ కు బానిసలైన వారికి ఇవేవీ చెవికి ఎక్కవు. స్మోకింగ్ చేసేవారికే కాదు.. వారి పక్కనున్న వారికి కూడా ప్రమాదమేనన్న విషయం అందరికీ తెలిసిందే.

కానీ తాజాగా స్మోకింగ్ వల్ల కలిగే అనేక రకాల నష్టాలను, దుష్ప్రభావాలను వెళ్లడించారు శాస్త్రవేత్తలు. బ్రాడ్ ఫోర్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పొగరాయుళ్ల వల్ల కలిగే అనేక ప్రమాదాలను తాజాగా వెళ్లడించారు . స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి వారి వీర్యంలోని డీఎన్ ఏ దెబ్బతింటుందట. దాని మూలంగా వారికి పుట్టబోయే పిల్లలకు కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు వెళ్లడించారు.

ఒకవేళ పిల్లలను కనాలనుకునే వారికి ఒక సూచన కూడా ఇచ్చారు. గర్భం దాల్చడం కంటే 3 నెలల ముందు నుంచి పొగ తాగడం మానుకోవాలి. దాంతో మగవారి వీర్యంలోని డీఎన్ ఏ మెరుగుపడుతుంది. దాంతో పిల్లలు కూడా ఆయురారోగ్యంగా పుడతారు. సో రాబోయే తరం ఎలాంటి అనారోగ్యానికి గురికాకుండా ఉండాలంటే పొగకు దూరంగా ఉండటం ఎంతో మంచిదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

మ‌రో బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా

క‌మ‌ల్ హాసన్ కారుపై ‘దాడి’

ప‌సుపు పాల‌తో ప్ర‌యోజ‌నాలెన్నో !

చెరుకు రసంతో మహిళలకు ఎన్ని ప్రయోజనాలో తెలుసా..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -