Wednesday, April 24, 2024
- Advertisement -

కారును ఢీ కొట్టిన విమానం !

- Advertisement -

ఇది మాములు ప్ర‌మాదం కాదు ! ఏకంగా ఓ కారును మిమానం ఢీ కొట్ట‌గా జ‌రిగిన దుర్ఘ‌ట‌న‌! అవును మీరు చ‌దివింది నిజ‌మే ! సాధార‌ణంగా కారు ప్ర‌మాదాలు అంటే రెండు రోడ్డుపై వెలుతు‌న్న వాహ‌నాల మధ్య చోటుచేసుకుంటాయి. కానీ ఈ ప్ర‌మాదం విచిత్రంగా రోడ్డుపై వెళ్లే కారు.. ఆకాశంలో వెళ్లే విమానానికి మ‌ధ్య జ‌రి‌గింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు వ్య‌క్తులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దుర్ఘ‌ట‌న అగ్ర‌రాజ్యం అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో తాజాగా చోటుచేసుకుంది. రోడ్డుపై వెలుతున్న కారుపై గాలిలో విహ‌రిస్తున్న మిమానం కూలింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో ముగ్గురు వ్య‌క్తులు స‌జీవ ద‌హ‌న‌మ‌య్యారు. అక్క‌డి పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దక్షిణ ఫ్లోరిడాలోని నార్త్‌ పెర్రీ విమానాశ్రయం నుంచి ఒకే ఇంజిన్‌ ఉండే ఓ చిన్న విమానం టేకాఫ్ అయిన కొద్ది సేప‌టికే.. సాంకేతిక లోపం త‌లెత్త‌డంతో ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న కారుపై కుప్పకూలింది.

దీంతో వెంట‌నే అక్క‌డ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం కార‌ణంగా ఏర్ప‌డిన మంట‌ల్లో ముగ్గురు తీవ్రంగా గాయ‌పడ్డారు. ర‌క్ష‌ణ సిబ్బంది వెంట‌నే స్పందించి వారిని ఆస్పత్రికి త‌ర‌లించ‌గా.. అప్ప‌టికే వారు ప్రాణాలు కోల్పోయార‌ని వైద్యులు తెలిపారు. ఈ ప్ర‌మాద దృశ్యాలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

మీరు పొగతాగుతారా..? అయితే మీ పిల్లలు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయి

దేశంలో తొలి లీగల్ సెక్స్ స్టోర్ ఎక్క‌డుందో తెలుసా?

అమీర్ ఖాన్ సంచలన నిర్ణయం

మ‌రో బాలీవుడ్ బ్యూటీకి క‌రోనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -