Friday, April 26, 2024
- Advertisement -

మూడో టీ20లో టీమిండియా పరాజయం!

- Advertisement -

అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిపాలైంది. 157 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది.  మొన్నటి వరకు మంచి ఫామ్ కొనసాగించిన టీమ్ ఇండియా ఈసారి మాత్రం చేతులెత్తేసింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమిండియాకు బ్యాటింగ్ అప్పగించింది. ఇంగ్లండ్ బౌలర్లు బౌలింగ్ విషయంలో సూపర్ గా రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమిండియా ఇన్నింగ్స్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ (46 బంతుల్లో 77 నాటౌట్) టాప్ స్కోరర్ గా నిలిచాడు.

ఇక ఓపెనర్ జోస్ బట్లర్ (83 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సులు) దూకుడుగా ఆడడంతో ఇంగ్లండ్ కేవలం 2 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. బట్లర్ కు తోడు జానీ బెయిర్ స్టో (40 నాటౌట్; 5 ఫోర్లు) కూడా ధాటిగా ఆడాడు. ఈ విజయంతో ఇంగ్లండ్ 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ మార్చి 18న అహ్మదాబాద్ లోనే జరగనుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -