Saturday, May 18, 2024
- Advertisement -

కంచే: రివ్యూ

- Advertisement -

ముకుందా సినిమాతో వినూత్న పంథాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్ అందరు మెగా హీరోల లాగా తాను కమర్షియల్ సినిమాల కోసం వెంపర్లు ఆడే రకం కాదు అని చెప్పకనే చెప్పాడు. ఆ సినిమా పరవాలేదు అనిపించినా వెంటనే కంగారు పడకుండా రెండవ సినిమా డైరెక్టర్ క్రిష్ తో సంతకం పెట్టినప్పుడే అతని గేట్స్ ని విశ్లేషకులు మెచ్చుకున్నారు. వేదం , గమ్యం లాంటి క్లాసిక్స్ తీసిన రాధా కృష్ణ జాగర్లమూడి కమర్షియల్ హిట్ లు లేవు అనిపించుకుంటూ నే మంచి ఓపెనింగ్స్ ని సాధిస్తున్న డైరెక్టర్. వారిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం.

 కథ – కథనం – పాజిటివ్స్ 

రొటీన్ కథ ని ఊర్లో జరిగే అతి సాధారణ ప్రేమకథని రెండవ ప్రపంచ యుద్ధానికి ముడిపెట్టి ఎంత చక్కగా తెలివిగా తీయచ్చో అంత బాగా కథని రాసుకున్నారు దర్శకుడు క్రిష్. ఊర్ల మధ్యలో రగిలే జాతి, కుల కుమ్ములాటల నేపధ్యం లో రాసుకున్న అతి సాధారణ కథ ని హిట్లర్ లాంటి ఒక అరాచక నియంత కి ముడిపెట్టి. ప్రతీ  పల్లెలో రెండవ ప్రపంచ యుద్ధమే జరుగుతోంది అంటూ అధ్బుతమైన నిర్వచనం ఇచ్చారు. హీరో వరుణ్ తేజ్ తన నటన తో చక్కగా ఆకట్టుకున్నాడు, హీరోయిన్ పరవాలేదు అనిపించింది. ఇతరులకి కథలో స్కోప్ లేదు. డాక్యుమెంటరీ మాదిరిగా తీసుకుపోతూ మధ్యలో సరైన సన్నివేశాలు జోడించి దర్శకుడు ఎక్కడా బోర్ కొట్టించలేదు. దర్శకుడిగా రాధా కృష్ణ సినిమా తీస్తే అందులో ఎంతటి ఎమోషన్ ఉండాలి అని సగటు ప్రేక్షకుడు ఊహిస్తాడో అంతా చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు . డయలాగులు రాసిన క్రాంతి మాధవ్ మరొక మెట్టు ఎక్కేసాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చక్కగా కుదరడం తో యుద్ధం సన్నివేశాలు బాగా తీయడానికి ఉపకరించింది. స్క్రీన్ ప్లే ని చాలా పర్ఫెక్ట్ గా రాసారు.

నెగెటివ్ 

హీరోయిన్ మాత్రమే కాస్త నెగెటివ్ అని చెప్పాలి అది కూడా నటనలో కాదు కానీ ఆమె ని చూస్తే అసలు భారతీయురాలి లాగానే అనిపించదు. ట్రైలర్ చూసినపుడు కూడా ఎవరో అమెరికన్ ని మనోడు ప్రేమించిన కథ ఇది అనుకుంటారు కానీ ఒక పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ కి అంత ఎర్ర తోలు ఉన్న హీరోయిన్ ఎందుకో అర్ధం కాలేదు. సినిమా లో మరొక ఇబ్బందికర అంశం చాలా చోట్ల స్క్రీన్ ప్లే స్లో అవడమే, పాటలు కూడా అవసరం లేని చోట అడ్డు తగిలి ఇబ్బంది పెట్టాయి. కమర్షియల్ అంశాలు అస్సలు లేకపోవడం తో ఈ సినిమా బీ సి సెంటర్ లలో డౌట్ గా నడుస్తుంది.

మొత్తంగా .. కమర్షియల్ హిట్ లేదు అంటున్న క్రిష్ కి ఇది సరైన సినిమా అని చెప్పచ్చు. నడుస్తున్న కథ వెనకాల మరొక సోల్ కథ ని ఉంచడం సినిమా కి పరమార్ధం ఆ రకంగా తెలపడం క్రిష్ స్టైల్ ఇందులో కూడా అదే చేసి తెలుగు సినిమా రంగం లో ఆయన ఒక   వీరేశలింగం అనిపించాడు .. ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం ఈ క్లాసిక్ ని చూడండి. కమర్షియల్ హంగులు లేకపోతే సినిమా చూడలేని వారు మీరు అయితే ! ఈ సినిమా కి ఆమడ దూరం లో ఉండండి. కొత్త ప్రయత్నం నచ్చి తీరే ప్రయత్నాలు ఆసక్తి గా చూసే వారు అయితే ఇది మీ కోసమే తీసారు. – హిట్టు సినిమా 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -