Monday, May 20, 2024
- Advertisement -

‘కేశవ’ మూవీ రివ్యూ

- Advertisement -
keshava movie review

రెగ్యులర్ కమర్సియల్ సినిమాలు కాకుండా.. కొత్తరకం కథలతో.. కొత్త సినిమాలను చేస్తూ సక్సెస్ అవుతున్నాడు యంగ్ హీరో హీరో నిఖిల్. ఇప్పుడు మరో సారి కొత్త రకమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అరుదైన గుండె జబ్బుతో ఎక్కువగా ఆవేశపడలేని ఓ యువకుడు తన పగను ఎలా తీర్చుకున్నాడన్న కథతో తెరకెక్కిన కేశవ.. ఎలా ఉందో.. నిఖిల్ కు మరో సక్సెస్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :
పి. కేశవ శర్మ(నిఖిల్) కు.. ఎడమ పక్కన ఉండాల్సిన గుండే కుడి పక్కన ఉంటుంది. దాంతో ఎక్కువ ఆవేశపడితే.. గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితుల్లో కేశవ పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన అధారాలు దొరకకుండా జాగ్రత్తపడతాడు. అదే టైంలో కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ(రీతూ వర్మ) అతన్ని గుర్తు పట్టి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంది. అయితే హత్యలు ఎవరు చేస్తున్నారు అనే విషయంపై స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రా ఇన్వెస్టిగేషన్ మొదలు పెడుతోంది. ఒక టైంలో షర్మిలకు కేశవ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవను అరెస్ట్ చేస్తుంది. మరి తన పగ తీరకుండా అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు..? అసలు కేశవ హత్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది..? హత్యలు చేసాక కేశవ ఏమయ్యాడు..? అనేది మిగిత కథ.

{loadmodule mod_custom,Side Ad 1}

ప్లస్ పాయింట్స్ :

రోటిన్ కథలతో కాకుండా ప్రయోగాత్మక చిత్రాలు ఎచ్చుకోవడంలో నిఖిల్ ఎప్పుడు ముందు ఉంటాడు. అయితే ప్రయోగాత్మక సినిమా చేసినప్పటికి లవర్ బాయ్ కనిపించాడు నిఖిల్. ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో అందరిని ఆకటుకున్నాడు. ప్రధానంగా సినిమాలో బరువైన ఎమోషన్ ను మోస్తున్నట్టుగా మంచి నటన చూపించాడు. హీరోయిన్ రీతూవర్మ తన అందంతో.. నటనతో అందరిని మెప్పించింది. చాలా కాలం తర్వాత కనిపించిన ఇషా కొప్పీకర్, పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సరిపోయింది. కామెడీ విషయంలో వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల పర్వాలేదనిపించారు. దర్శకుడు సుధీర్ వర్మ అద్భుతమైన టేకింగ్తో సూపర్ అనిపించుకున్నాడు. స్క్రీన్ ప్లేతో మాయ చేశాడు. అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ పెట్టకుండా సినిమాని ఆసక్తిగా తీసుకెళ్ళాడు. సస్పెన్స్ రివీల్ చేసే సీన్ బాగుంది. దివాకర్ మణి అందించిన సినిమాటోగ్రఫి సినిమాకి ప్రధానం బలంగా మారింది. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే.. సినిమా కథ విషయంలో జాగ్రత్త గా ఉండే నిఖిల్ ఈ సినిమా కథ విషయంలో ఆ జాగ్రత్త మిస్ చేసాడు. కథ రొటిన్ గా నడుస్తోంది. కామెడీ సిన్స్ సినిమాలో మిస్ చేసారు. ఫస్ట్ ఆఫ బానే నడిచిన.. సెకండ్ ఆఫ్ కి వచ్చేసరికి సినిమా స్లో నారేషన్ లో నడుస్తోంది. పాటలపై కాస్త దృష్టి పెడితే బాగుండు అనిపించింది.

మొత్తంగా :

ఈ సినిమాలో ఆసక్తి కలిగించే స్క్రీన్ ప్లే.. అదరగొట్టిన నిఖిల్ నటన.. అద్భుతంగా ఉన్నాయి. సినిమాటోగ్రఫి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానంగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గా కనిపించగా.. సెకండ్ హాఫ్ స్లో నారేషన్.. రొటీన్ స్టోరి.. లోపల్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పలంటే.. ఆసక్తికర స్క్రీన్ ప్లే.. నిఖిల్ సినిమాలు.. థ్రిల్లర్ కథలు నచ్చేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -