Saturday, May 18, 2024
- Advertisement -

దిలీప్​కుమార్​ ఇకలేరు..

- Advertisement -

బాలీవుడ్​ అగ్రనటుడు దిలీప్​ కుమార్​ (98) ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముంబై హిందూజా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇవాళ ఉదయం 7.30 గంటలకు దిలీప్​ మృతిచెందారని అక్కడి వైద్యులు తెలిపారు. ఈ మేరకు దిలీప్​ కుటుంసభ్యులు కూడా ట్వీట్ చేశారు. దిలీప్​ కుమార్​ మృతికి ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

‘దిలీప్​ కుమార్​ ఓ లెజెండ్​ నటుడు. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. తన నటనతో ఆయన ఓ తరాన్ని తన్మయత్వానికి గురిచేశారు. ఆయన సన్నిహితులు, కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అంటూ మోదీ ట్వీట్​ చేశారు.ఇక వయసుతో వచ్చే అనారోగ్య సమస్యల వల్లే ఆయన మృతి చెందినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

మొఘలే ఆజం’, ‘దేవదాస్’, ‘నయా దౌర్’, ‘రామ్ అవుర్ శ్యాం’ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో ఆయన నటించారు. ఆయన చివరగా 1998లో వచ్చిన ‘కిలా’ సినిమాలో కనిపించారు. విషాద సన్నివేశాల్లో దిలీప్​ కుమార్​ అసమాన ప్రతిభా పాటవాలు చూపించారు. ఆయన నటనకు ఆ రోజుల్లో కన్నీరు పెట్టని ప్రేక్షకుడు ఉండడంటే అతీశయోక్తి కాదేమో. జూన్​ 6న ఆయన శ్వాస సంబంధిత వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. దిలీప్​ కుమార్​ మృతికి బాలీవుడ్​ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -