Saturday, May 18, 2024
- Advertisement -

‘మిస్టర్’ మూవీ రివ్యూ

- Advertisement -
mister movie review

స్టార్ హీరోలతో  బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన శ్రీనువైట్ల.. రెండు ఘోరమైన ప్లాప్ లతో కష్టాల్లో పడ్డాడు. ఇక వరణ్ తేజ్.. మంచి హీరో అనిపించుకున్న కమర్షియల్ హీరోగా సక్సెస్ కాలేదు. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ ఫార్ములా తో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఈ ఇద్దరికి ఎంతవరకు ఉపయోగపడిందో చూద్దాం..

కథ :

చై(వ‌రుణ్ తేజ్) యూర‌ప్ లో ఉంటాడు. అక్క‌డే ఫ్యామిలీతో క‌లిసి ఉంటాడు. అలాంటి టైమ్ లో మీరా(హెబ్బాప‌టేల్) చై జీవితంలోకి వ‌స్తుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమ‌లో ప‌డ‌తాడు చై. ఆ త‌ర్వాత ఆమెను ఇంప్రెస్ చేయ‌డానికి ట్రై చేస్తాడు. అలాంటి టైమ్ మీరా మ‌రొక‌రి ప్రేమ‌లో ఉంద‌ని తెలిసి.. వాళ్లిద్ద‌ర్నీ క‌ల‌ప‌డానికి ఇండియా వ‌స్తాడు. అక్క‌డ చంద్ర‌ముఖి(లావ‌ణ్య త్రిపాఠి) ప‌రిచ‌యం అవుతుంది. అక్క‌డ్నుంచో మ‌రో క‌థ మొద‌లవుతుంది. అస‌లు ఏంటి ఆ క‌థ‌.. చైకి, చంద్ర‌ముఖికి ఎలా ప‌రిచ‌యం.. ఇదంతా మిగిలిన క‌థ‌.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ముఖ్య చెప్పుకోవాల్సింది వరుణ్ తేజ్ గురించి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నాడు. తనదైన కామెడీ టైమింగ్ తో మెప్పించే ప్రయత్నం బానే చేశాడు. లావణ్య త్రిపాఠి నటన ఆకట్టుకుంటుంది. అన్ని రకాల ఎమోషన్స్ తో తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. ఇక హెబ్బా పటేల్ అందంతో.. నటనతో ఆకట్టుకుంది. ఇక విలన్ గా నికితిన్ ధీర్ అద్భుతంగా చేశాడు. డీసెంట్ లుక్స్ లో కనిపిస్తూనే క్రూయల్ విలన్ గా మెప్పించాడు. ఇక నాజర్, తనికెళ్ల భరణి, 30 ఇయర్స్ పృధ్వీ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఫస్ట్ హాఫ్ లో స్పెయిన్ అందాలతో పాటు కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. మిక్కీ జె మేయర్ అందించిన పాటలు పర్వాలేదు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. 

మైనస్ పాయింట్స్ :

లాంగ్ గ్యాప్ తరువాత తెరకెక్కించిన ఈ సినిమాతో శ్రీను వైట్ల ఎక్కువగా రిస్క్ చేయకుండా తన రొటీన్ ఫార్ములానే ఫాలో అయ్యాడు. శ్రీను గత సినిమాల్లో కనిపించిన మాసాలా ఎలిమెంట్స్ అన్నీ మిస్టర్ లోనూ కనిపించాయి. ఫస్ట్ ఆఫ్ పర్వాలేదు అనిపించిన సెకండాఫ్ లో రొమాంటిక్ సీన్స్ తో కథ లాగించేసాడు దర్శకుడు. హడావిడిగా అసలు ఆసక్తి లేకుండా సెకండాఫ్ బోర్ కొట్టించింది. వరుసగా తెరమీదకు వచ్చే కొత్త పాత్రలు, మలుపులు ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది. 

మొత్తంగా :

ఈ సినిమాలో వరుణ్, లావణ్య, హెబ్బా.. ఇతర ముఖ్య పాత్రలు అకట్టుకోగా.. యాక్షన్ సీన్స్ పర్వాలేదు అనిపిస్తాయి. ఇక సినిమా కథలో దమ్ము లేకపోవడం.. సెకండఫ్ బోర్ కొట్టించడం ఇందులో మైనస్ గా కనిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా  రొటిన్ కామెడీలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -