Friday, May 3, 2024
- Advertisement -

ఈ లెటర్ చదివితే మీరూ ఏడుస్తారు

- Advertisement -

ప్రముఖ పాటల రచయిత ముత్తుకుమార్ తాను చనిపోతాను అని తెలుసుకుని అంతకంటే ముందరే తన కొడుకు కోసం రాసిన ఒక లేఖ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఆయన తుదిశ్వాస విడిచిన ఆదివారం సాయంత్రం తన తోమ్మిది సంవత్సరాల కొడుకు కోసం ఈ లేఖ రాసారు. ఆ లేఖ చదివితే కంట్లో నీళ్ళు కారడం అనేది మనకి తెలీకుండానే జరుగుతుంది.

‘‘ప్రియమైన కుమారుడికి నాన్న రాస్తున్నది.. ఇది నేను రాసే తొలి లేఖ. దీన్ని చదివి అర్థం చేసుకునే వయసులో నీవు లేవు. భాష వేళ్లు పట్టుకుని.. నడుస్తున్నావ్‌. నా దగ్గర నుంచి మా నాన్న దాచిన రహస్యాల పెట్టె తాళాన్ని నేను వెతికినట్టే.. నువ్వూ వెతుకుతావు. కానీ జీవితంలో చాలా జాగ్రత్తగా అడుగులేయాలి. ఎక్కువగా ప్రయాణాలు చెయ్‌. ఆ ప్రయాణాలే నీకు విలువైన అనుభవాన్నిస్తాయి. పుస్తకాలను ప్రేమించు. ఒక్కో పుస్తకం.. ఒక్కో అనుభవాన్ని నేర్పుతుంది. మీ తాత, నాన్న పుస్తకాల ప్రపంచంలోనే కనుమరుగయ్యారు.

నీ రక్తంలోనూ ఆ నది ప్రవహిస్తూనే ఉంటుంది. దక్కిన పని కన్నా.. నచ్చిన పని చెయ్‌. ఆనందమైన జీవితాన్ని కొనసాగించు. ఎవరైనా సహాయం కోరితే.. అప్పు చేసి అయినా సహాయపడు. అందులో లభించే ఆనందం అద్వితీయమైనది. బంధువులతో సన్నిహితంగానూ ఉండు; దూరంగానూ ఉండు. ఈ ప్రపంచంలో అన్ని బంధాలకన్నా.. విలువైనది స్నేహం మాత్రమే. మంచి స్నేహితులను చేర్చుకో. నీదారి చక్కబడుతుంది. ఇవన్నీ.. మా నాన్న నాకు చెప్పకుండా చెప్పినవే. నేను నీకు చెప్పదలచి చెబుతున్నవి. నువ్వు జన్మించిన తర్వాతే నా తండ్రి ప్రేమను, అనురాగాన్ని అప్పుడప్పుడు అర్థం చేసుకోగలిగా. రేపు నీకో కొడుకు పుడితే అప్పుడు నా ప్రేమానురాగాలు అర్థమవుతాయి. రేపు, మరునాడు నువ్వు నీ మనవళ్లతో ఏదో ఒక వూరిలో నవ్వులొలుకుతూ మాట్లాడుతున్నప్పుడు నా జ్ఞాపకం వస్తే.. ఈ లేఖను ఒక్కసారి తీసి చూడు! నీ కంటిలో నుంచి వచ్చే కన్నీటిలో నేనుంటా’’ – మీ నాన్న

Related

  1. బాలకృష్ణ కొడుకు ఫస్ట్ సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్
  2. సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు
  3. నాగర్జున కు ఛాలెంజ్ చేసిన శ్రీకాంత్ కొడుకు
  4. రాజమౌళి కొడుకు ఏం చేస్తున్నాడు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -