Sunday, May 19, 2024
- Advertisement -

‘అమ్మమ్మగారిల్లు’ రివ్యూ

- Advertisement -

యువ క‌థానాయ‌కులంటే కేవ‌లం కాలేజీ క‌థ‌లు, ప్రేమ‌క‌థ‌లే కాదు.. కుటుంబ క‌థల్లోనూ చ‌క్క‌గా ఒదిగిపోతుంటారు. ఆ త‌ర‌హా చిత్రాలతో విజ‌యాల్ని సొంతం చేసుకొన్న క‌థానాయ‌కులు చాలామందే. ‘ఛ‌లో’తో మంచి విజ‌యాన్ని అందుకున్న నాగ‌‌శౌర్య.. అందుకు భిన్నమైన క‌థ‌తో ‘అమ్మ‌మ్మ‌గారిల్లు’ చేశాడు. నాగ‌శౌర్య‌కి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నిచ్చింది? ఫ‌క్తు కుటుంబ క‌థ‌లో నాగ‌శౌర్య ఎలా ఒదిగిపోయాడు? అనేది తెలుసుకుందాం!

కథ:
సీతామహాలక్ష్మి(సుమిత్ర)ది పెద్ద కుటుంబం. ఆస్తి పంపకాలపై పేచీలు మొదలు కావడంతో కుటుంబ పెద్ద సూర్యనారాయణ(చలపతిరావు) కలత చెంది చనిపోతాడు. దాంతో కుటుంబం చెల్లాచెదురవుతుంది. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు తలో దిక్కు వెళ్లిపోతారు. 20 ఏళ్లయినా తిరిగిరారు. కానీ, చిన్నప్పుడే అమ్మమ్మతో అనుబంధం ఏర్పరుచుకున్న సంతోష్‌(నాగశౌర్య) అందర్నీ కలపాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఏం చేశాడు అనేది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణ :
తెలిసిన కథే. అదే కుటుంబం.. అవే బంధాలు.. కానీ, పలు సన్నివేశాలు హృదయాల్ని హత్తుకుంటాయి. చాలా రోజుల తర్వాత మరొక స్వచ్ఛమైన కుటుంబ కథను చూసిన అనుభూతికి గురిచేస్తాయి. కుటుంబ కథలు ఎన్ని వ‌చ్చిన మళ్లీ మళ్లీ తెరకెక్కడం, వాటిని ప్రేక్షకులు ఆదరించడం వెనుక కారణం బంధాలు-అనుబంధాల గొప్పతనాలే. ప్రతి ప్రేక్షకుడికి వేగంగా కనెక్ట్‌ అయ్యే విషయాలివి. కాకపోతే వాటి మధ్య సంఘర్షణ సరైన రీతిలో పండేలా చూసుకోవాలి.

నటీనటులు- సాంకేతికవర్గం:
కుటుంబ కథలకు రావు రమేశ్ ఎంత బలమో ఈ సినిమాతో మరోసారి చాటి చెప్పారు. ఆవేశపరుడైన ఇంటి పెద్దకొడుకుగా ఆయన నటన హావభావాలు చిత్రానికి హైలైట్‌గా నిలిచాయి. సంతోష్‌ అనే మనవడి పాత్రలో నాగశౌర్య ఒదిగి పోయాడు. పాత్రకు ఎంత అవసరమో అంతే మోతాదులో నటిస్తూ భావోద్వేగాలు పండించాడు. శివాజీ రాజా, సుమిత్ర, రవి ప్రకాశ్‌, హేమ, సుధ తదితరుల పాత్రలు అలరిస్తాయి. స్నేహితుడి పాత్రలో షకలక శంకర్‌ నవ్విస్తాడు.సాంకేతికంగా సినిమా బాగుంది. ముఖ్యంగా మాటలు చిత్రానికి ప్రాణం పోశాయి. దర్శకుడు పాత కథనే కొత్తగా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకునేలా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. కల్యాణ్‌ రమణ సంగీతం, ఛాయాగ్రహణం దర్శకుడి ఆలోచనలకు తగ్గట్టుగా కుదిరాయి.ఇక‌ చాల రోజుల త‌రువాత హీరోయిన్ షామిలి ఈ సినిమాలో న‌టిచింది.హీరోకి మ‌ర‌ద‌లు క్యారెక్ట‌ర్‌లో షామిలి ఆక‌ట్టుకుంది.హీరో కుటుంబాన్ని క‌లిపై ప్ర‌య‌త్నం చేస్తుంటే వాటిని చెడ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తు ప్రేక్ష‌కుల‌కు న‌వ్వులు తెపిస్తుంది.

బోట‌మ్ లైన్ :అమ్మమ్మతో గ‌ట్టెక్కిన నాగ‌శౌర్య‌

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -