Sunday, May 19, 2024
- Advertisement -

ఛలో మూవీ రివ్యూ……. హీరో నాగశౌర్య కెలుకుడు రిజల్ట్ ఏంటి? సినిమా ఎలా ఉంది?

- Advertisement -

తెలుగు సినిమా హీరోలందరూ కూడా డైరెక్టర్ పనిలో కొద్దో గొప్పో వేళ్ళు కాళ్ళూ పెడుతూనే ఉంటారు. కానీ ఆ విషయాన్ని ధైర్యంగా మీడియా ముందు చెప్పే సాహసం చెయ్యరు. ఎందుకంటే సినిమా పోయిందంటే హీరో కెలుకుడు వళ్ళే పోయిందన్న విమర్శలు వస్తాయని. అయితే నాగశౌర్య మాత్రం అందుకు భిన్నంగా స్పందించాడు. కథ విషయంలో, డైరెక్టర్ పనిలో ఒక్క వేళ్ళేంటి…..కాళ్ళు కూడా పెట్టాను…..ఇక ముందు కూడా పెడతాను….అన్నీ నాకు నచ్చినట్టే నేనే చూసుకుంటాను అనే స్థాయిలో మాట్లాడేశాడు. నాగశౌర్య మాటలు మీడియా జనాలకు కూడా ఆశ్ఛర్యమనిపించాయి. సినిమాపైన ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండి మాట్లాడుతున్నారేమో అనుకున్నారు. మరి నాగశౌర్య అంత నమ్మకం పెట్టుకున్న ఛలో సినిమా ఎలా ఉంది? అంతా తానే అయి చూసుకున్న సినిమా జనాలను ఎంటర్టైన్ చేసిందా?

ముందుగా ఛలో కథ గురించి చెప్పుకుందాం. తమిళనాడు-ఆంధ్రప్రదేశ్‌కి బోర్డర్‌లో ఉండే ఒక ఊరు. అస్తమానూ గొడవలంటే ఇష్టపడే హీరోగారి పోరుపడలేక ఆయన తండ్రి ఆ ఊరుకి మనవాడిని పంపిస్తాడు. ఇక అక్కడ షరా మామూలుగానే వైరి వర్గం అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. రెండు ఊర్ల మధ్య గొడవలు ఆగిపోతేనే నిన్ను పెళ్ళాడతానని ఆ అమ్మాయి కండిషన్ పెడుతుంది. ఆ తర్వాత శ్రీనువైట్ల సినిమాల తరహాలో కామెడీ కామెడీగా హీరోగారు ఆ రెండు ఊర్లను ఎలా కలిపేశాడు? గొడవలు లేకుండా ఎలా చేశాడు అన్నది కథ.

శ్రీనువైట్ల-కోనవెంకట్‌లే ఈ తరహా కథలతో వచ్చిన దారుణమైన ఫలితాల దెబ్బకు రూట్ మార్చుకుంటూ ఉన్నారు. కానీ కొత్త డైరెక్టర్-యంగ్ హీరో మళ్ళీ ఆ పాత రొడ్డ కొట్టుడు కథను స్క్రీన్ పైకి తీసుకొచ్చే ధైర్యం చేయడం ఆశ్ఛర్యం కలిగిస్తుంది. నిజానికి సినిమా ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్, కుర్రకారు కామెడీ సీన్స్ ఒకింత ఫర్వాలేదనిపిస్తాయి. కానీ సెకండ్ హాఫ్ రొటీన్ శ్రీనువైట్ల తరహా కథనం, సీన్స్ మాత్రం ఇరిటేట్ చేస్తాయి. కామెడీ పండడం విషయం పక్కన పెడితే కథనం అంతా కూడా పరమ బోరింగ్‌గా ఉంటుంది. అక్కడే సినిమా పూర్తిగా గాడితప్పేసింది.

ఇక నాగశౌర్య కూడా కొత్తగా చేసిందేమీ లేదు. యంగ్ హీరోల్లో కాస్త ప్రతిభావంతుడైన ఈ హీరో ఒకే తరహా నటనతో విసిగిస్తున్నాడు. కథ, కథనం, డైరెక్షన్‌లలో వేళ్ళు, కాళ్ళు పెట్టడం తగ్గించి కాస్త యాక్టింగ్‌పైన కాన్సన్‌ట్రేట్ చేస్తే బెటర్. సినిమాలో చాలా మంది సీనియర్ నటులు ఉన్నారు కానీ సెకండ్ హాఫ్ కథ, కథనం మరీ బోరింగ్‌గా ఉండడంతో ఎవ్వరూ కాపాడలేకపోయారు. మొత్తంగా హీరోలే కథ, కథనాల్లో కాల్లూ, వేళ్ళూ పెట్టి వాళ్ళకు నచ్చినట్టుగా సినిమాలు తీసుకుంటే ప్రక్షకులు చూడరు అన్న విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. ఈ సినిమాతో మరోసారి ఆ వైనం తెలిసొచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మరీ డల్‌గా ఉన్నాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇక మొదటి షో నుంచే నెగిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ పడడం అయితే ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -