Monday, May 20, 2024
- Advertisement -

‘నగరం’ మూవీ రివ్యూ!

- Advertisement -
Nagaram Movie Review in Telugu

సరైనా హిట్ కొసం ఎదురు చూస్తున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. ఆయన నటించిన తాజా చిత్రం ‘నగరం’. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సందీప్ కిషన్ కి ఎలాంటి హిట్ ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ సినిమా అంతా సమాంతరంగా నడిచే నాలుగు విడి విడి కథల ఆధారంగా నడుస్తుంది. ఒక పెద్ద క్రిమినల్ కుమారుడి ప్రమేయమున్న ఒక కిడ్నాప్ లో అప్పటి వరకు సరదాగా, హాయిగా కాలం గడిపే సందీప్ కిషన్ మరియు రెజినాలు అనుకోకుండా ఇరుక్కుంటారు. సినిమా అంతా వాళ్ళు ఆ కిడ్నాప్ లో ఎలా ఇరుక్కున్నారు ? సమయంతో పాటు ఒక్కొక్క కథ ఎలా నడిచింది ? చివరకు ఆ నాలుగు కథలు ఎలా ముగిశాయి ? అనేది చూపబడుతుంది.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో ప్రధానమైన ప్లస్ పాయింట్ విషయంకు వస్తే.. ఆరంభం నుండి చివరి వరకు కొనసాగించబడిన సస్పెన్స్. ప్రతి సన్నివేశంలో ఏం జరుగుతుంది అనే ఉత్సుకట కొనసాగింపబడి ఎక్కడా ప్రేక్షకుడి ఆసక్తి సడలిపోలేదు. దర్శకుడు లోకేష్ తను రాసుకున్న స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. ఇక హీరో సందీప్ కిషన్ కూడా అద్భుతమైన నటన కనబర్చాడు. నిర్లక్ష్యం ఉన్న కుర్రాడిగా అతని లుక్స్, హావభావాలు, నటన అన్నీ బాగున్నాయి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పాత్రలో శ్రీ కూడా అద్బుతంగా నటించాడు. మొదటి భాగం మొత్తాన్ని మంచి ఆసక్తికరమైన కిడ్నాప్ సన్నివేశాలతో చాలా బాగా నడిపాడు దర్శకుడు. ఇక సెకండాఫ్ అంతా ఒక్కొక్క పాత్ర కథలో ఇన్వాల్వ్ అవుతూ చాలా బాగా తయారైంది. మంచి కథనంతో ప్రధాన కథను తయారు చేయడం మెప్పించింది. 

మైనస్ పాయింట్స్ :

ఈ మూవీలో హీరోయిన్ రెజినాకు అంతగా ప్రాధాన్యం లేదని చెప్పాలి. సినిమా కథనం బానే ఉన్న ఒక్కొక్క పాత్రను పరిచయం చేయడానికి, కథనంలో కుదురుకునేలా చేయడానికి దర్శకుడు మరీ ఎక్కువ టైమ్ తీసుకున్నాడు. సన్నివేశాలు నడిచే విధానం వేగంగా ఉంటే బాగుండేది. అలాగే ఫస్టాఫ్ బాగున్నా లెంగ్త్ కాస్త ఎక్కువైనట్టు అనిపించింది. చివరగా సినిమా ఆసక్తికరంగా సాగుతున్నప్పటికీ కథ కొన్ని చోట్ల రిపీట్ అవుతున్నట్టు అనిపిస్తోంది. 

మొత్తంగా :

సాంకేతిక విభాగం పని తీరు సినిమాలో బాగుంది. సెల్వకుమార్ సినిమాటోగ్రఫి అద్బుతంగా ఉంది. క్రైమ్ సీన్స్ అద్భుతంగా తీసాడు. చెన్నై మహా నగరాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించిన తీరు బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో చాలా ప్రభావవంతంగా చూపించారు. దర్శకుడు లోకేష్ రాసుకున్న కథను చాలా బాగా చెప్పాడు. నటీ నటుల నుండి మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టడంలో అతను పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల కొన్ని సీన్స్ బోర్ గా అనిపించాయి. రెజీనా పాత్ర పెద్దగా లేకపోవడం మైనస్ పాయింట్. ఒక్కమాటలో చెప్పాలంటే సందిప్ కిషన్ సినిమాలను, అలాగే మంచి కథనం ఉన్న సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -