Thursday, May 9, 2024
- Advertisement -

గుంటూరు లో తన అందాలు చూపించబోతున్న నమిత!

- Advertisement -
namitha re entry in tollywood

టాలీవుడ్ లో సొంతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన నమిత.. ఆ తర్వాత జెమిని, ఒకరాజు ఒకరాణి, బిల్లా సినిమాలతో పాటు పలు సినిమాల్లో నటించింది. ఈ చిత్రాలు అన్ని పెద్దగా సక్సెస్ కాకపోవడంతో నమితకు అదృష్టం కలిసి రాలేదు.

2010లో విడుదల అయిన సింహా సినిమా తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు నమిత. దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ఆమె టాలీవుడ్ లో మళ్లీ ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో అడల్ట్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన సినిమా గుంటూర్ టాకీస్. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాకి సీక్వెల్ రానుంది. గుంటూర్ టాకీస్-2 పేరుతో రాబోతున్న ఈ సినిమాని రాజ్ కుమార్ స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు.

ఇందులో నమిత కీలక పాత్రను చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం తెరకెక్కబోతుంది. ఇక ఇదే సినిమాలో సన్నీలియోన్ తో పాటు సౌత్ హాట్ భామ నమితను కూడా నటింపజేయబోతున్నారు. ఇటివలే ఈ సినిమా సంబంధించి నమితతో చర్చలు జరిపాడు. వీరిద్దరితో పాటు నికిషా పటేల్ ను కూడా ఈ సినిమా కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురుతో తెరకెక్కబోతున్న ఈ గుంటూర్ టాకీస్ 2 సినిమా ప్రేక్షకులను ఎలా కనువిందు చేస్తుందో చూడాలి.

Related

  1. నదియా ఎలాంటి సినిమా చేస్తుందో తెలుసా?
  2. రాధికా న్యూడ్ సినిమా ఎలాంటిదో తెలుసా?
  3. ప్రభాస్ ఎలాంటి ఆఫర్ వదులుకున్నాడో తెలుసా?
  4. రెజీనాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -