Friday, May 3, 2024
- Advertisement -

అమ్మ మృతదేహాన్ని సమాధి నుండి బయటకు.. ఎందుకంటే?

- Advertisement -
madras hc asks tn govt for jayalatha death issues

మద్రాస్ హైకోర్టు తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. అపోలో ఆసుపత్రిలో 75రోజుల పాటు చికిత్స తీసుకున్న జయలలిత డిసెంబర్ 5న చనిపోయిన విషయం తెలిసిందే. చికిత్స టైంలో తర్వలోనే డిశ్చార్జి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ అమ్మ బానే ఉందని అనుకునేలోపే… అమ్మ మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందని న్యాయస్థానం పేర్కొంది. ఈ విషయం మాట్లాడలని, పరీక్షల నిమిత్తం జయ మృతదేహాన్ని వెలికి తీయాలని ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని ప్రధానమంత్రి సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మద్రాస్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

జనవరి 9కి తదుపరి విచారణను వాయిదా వేసింది. జయలలిత మృతికి కారణాలు తెలిపేలా విచారణకు ఆదేశించాలని అన్నాడీఎంకే కార్యకర్త పీఏ జోసెఫ్ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఏర్పడ్డ జస్టిస్ ఎస్. వైద్యనాధన్, జస్టిస్ పార్ధిబన్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది. అమ్మ చికిత్స తీసుకునే టైంలో కోలుకొని ఆసుపత్రిలోనే పలువురితో సమావేశమైన ఫొటోలు న్యూస్ పేపర్ లో చూశాం. అలాంటి టైంలోనే ఆకస్మికంగా చనిపోయారు అని ధర్మాసనం అనుమానం వ్యక్తం చేసింది.

అమ్మ మారణానికి సంబంధించిన కారణాలేంటీ? ప్రభుత్వ అధికారులు కూడా ఆమె ఎందుకు శవానికి పంచనామా నిర్వహించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. 1980లలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంఆర్ చికిత్స పొందే సమయంలో ఆయనకు సంబంధించి వీడియోలు, ఫొటోలు ప్రభుత్వం రిలీజ్ చేసిందని, అమ్మ విషయంలో అలా జరగలేదని తెలిపింది. జయలలిత మృతిపై దాఖలు చేసిన మరో పిల్ పై జనవరి 4న విచారణ జరుగనుండగా, మరో వ్యాజ్యంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది.

Related

  1. ’అమ్మ’ కోసం ఎంజీఆర్ ను చెరిపేశారు..
  2. జయలలిత మరణం వెనక సీక్రెట్స్ ఇవే!
  3. షాకింగ్ :: జయలలిత ఆత్మ శాంతించలేదు — మళ్ళీ అంత్యక్రియలు
  4. జయలలిత తరవాత నేనే .. ఈ అమ్మాయి ఎవరు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -