Sunday, May 19, 2024
- Advertisement -

షాకింగ్ : బాహుబలి-2 టిక్కెట్ల తో పెద్ద మోసం

- Advertisement -
Newtickets.com Cheating Baahubali2 Tickets

బాహుబలి-2 సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా క్రేజ్ ను వినియోగించుకుంటూ పోలీసులకు చిక్కింది ఓ ఆన్ లైన్ సంస్థ. టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు చూపించేలా సాఫ్ట్ వేర్ రూపొందించి.. దాని సహాయంతో ఆన్ లైన్లో  టిక్కెట్ ఖరారైనట్లు సందేశం కూడా పంపుతోంది. ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన సైబర్ నేరాల అధికారులు ఇదొక నకలీ సంస్థగా తేల్చారు.

అయితే… అప్పటికే చాలామంది మోసపోయారు. బాహుబలి 2 సినిమా టిక్కెట్ల కోసం కొత్తగా www.newtickets.in పేరిట ఒక వెబ్ సైట్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ తోపాటు అమెరికా – ఇంగ్లాండులోని కొన్ని సినిమా హాళ్లలో టిక్కెట్లు అందుబాటులో ఉన్నట్లు అందులో చూపిస్తోంది. వెబ్ సైట్లోకి వెళ్ళాక అందులో థియేటర్స్.. అందులో సీట్లు కూడా ఉన్నట్లు చూపిస్తోంది. టిక్కెట్లు బుక్ చేసుకొని.. ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించాక.. కన్ఫర్మ్ చేస్తూ ఫోన్ కు సందేశం పంపిస్తోంది.

ఒక్కో టిక్కెట్ రూ.120 చొప్పున అమ్ముతున్నారు. అయితే హైదరబాద్ లో సినిమాహాళ్ల పేర్లన్నీ సైట్లో ఉండటం ప్రతి ఆటకూ టిక్కెట్లన్నీ ఖాళీగా ఉండడంతో కొందరు అనుమానించి.. తెలంగాణ సీఐడీ సైబర్ నేరాల విభాగానికి కంప్లయింట్ చేశారు. వారు పరిశోధించి అది నకిలీదని తేల్చారు. థియేటర్ల యాజమాన్యాలు కూడా ఆ వెబ్ సైట్ తో తాము ఒప్పందాలు చేసుకోలేదని చెబుతున్నారు. దీంతో అందులో టిక్కెట్లు కొన్నవారంతా మోసపోయినట్లేనని పోలీసులు అంటున్నారు.

{youtube}8fCgrdhARgc{/youtube}

Related

  1. బాహుబలి 2 స్టోరీ.. కట్టప్ప సీక్రెట్ ఇదే..
  2. బాహుబలి 2 సెన్సార్ రివ్యూ
  3. బాహుబలిలో ప్రభాస్ కు ఏ పాత్ర ఇష్టమో తెలుసా..?
  4. ‘బాహుబలి’ కోసం ప్రభాస్ కి 75 కోట్ల పారితోషకం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -