Tuesday, May 7, 2024
- Advertisement -

బాహబలి 2 పై ఎన్టీఆర్ షాకింగ్ కామెంట్స్

- Advertisement -
NTR Priases Rajamouli on Baahubali 2 Trailer

ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూస్తున్న సినిమా బాహుబలి పార్ట్ 2. బాహుబలి: ది కంక్లూజన్ టైటిల్ పై తెరకెక్కిన ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఆశించినట్లుగానే విజువల్ వండర్ గా సాగిపోయిన ఈ ట్రైలర్ కు ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. బాహుబలి2 ట్రైలర్ పై చాలా మంది హీరోలు స్పందిస్తున్నారు.

రాజమౌళి అండ్ టీంను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా బాహుబలి2 ట్రైలర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అరుదుగా స్పందించే ఎన్టీఆర్..  కనీసం తన మూవీ ప్రారంభంపై కూడా ట్వీట్ వేయని జూనియర్.. బాహుబలి2 ట్రైలర్ పై పోస్ట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది.  ‘ఇలాంటి అనుభూతిని వేరే దేనితో పోల్చడానికి సరిపోదు.

మీ పల్స్ పరిగెడుతుంది.. మీ ఊపిరి ఆగిపోతుంది. అంతే కాదు.. మరీ కళ్లప్పగించి చూస్తూనే ఉంటారు. శభాష్ జక్కన్న’ అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ ను చూస్తే.. ఎన్టీఆర్ చెప్పిన మాటలు నిజమే అనే మాట ఒప్పుకోవాల్సిందే. ట్రైలర్ లోనే ఇంత సినిమా చూపించేసి ఆకట్టుకున్న రాజమౌళి.. ఇక సినిమాతో ఎన్నేసి రికార్డులు బద్దలు కొట్టనున్నాడో చూడాలి. 

{youtube}qD-6d8Wo3do{/youtube}

{youtube}UGBZHNM8buA{/youtube}

Related

  1. పవన్.. ఎన్టీఆర్ మధ్య పోరు.. గెలుపు ఎవరిది..?
  2. డైరెక్టర్ కి సూపర్ గిప్ట్ ఇచ్చిన ఎన్టీఆర్.. రేటు ఎంతో తెలుసా?
  3. ఎన్టీఆర్ జై ల‌వ కుశ‌ లో చేసే మూడు రోల్స్ ఇవే
  4. అబ్బే.. ఎన్టీఆర్ ఏ మాత్రం మారలేదు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -