Sunday, May 19, 2024
- Advertisement -

నాని కోసం ఎన్టీఆర్ పాట !

- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ మంచి నటుడే కాదు.. మంచి పాటగాడు కూడా అని ఇప్పటికే చాలాసార్లు రుజువైంది. ‘యమదొంగ’లో ఓలమ్మీ తిక్క రేగిందా అనే పాట పాడినపుడు ఏదోలా అనిపించింది కానీ.. ఆ తర్వాత 123 నేనొక కంత్రి.. రాకాసి రాకాసి.. ఐ వానా ఫాలో ఫాలో లాంటి పాటలతో తన ప్రత్యేకత చాటుకున్నాడు తారక్. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కోసం కూడా ఓ పాట అందుకున్నాడు ఎన్టీఆర్.

అది కూడా సూపర్ హిట్టయింది. తాజాగా తెలుగులో మరో హీరో కోసం ఎన్టీఆర్ పాట పాడబోతున్నాడు. ఆ హీరో నాని కావడం విశేషం. నేచురల్ స్టార్ నటిస్తున్న కొత్త సినిమా ‘పక్కా లోకల్’ కోసం యంగ్ టైగర్ గొంతు అరువిస్తున్నాడట. ‘పక్కా లోకల్’కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. నాని సినిమాకు అతను పనిచేయడం ఇదే తొలిసారి. దేవిశ్రీతో ఎన్టీఆర్ కు మంచి అనుబంధం ఉండగా.. నానితో కూడా మంచి స్నేహమే ఉంది.

ఇక దిల్ రాజు కూడా ఎన్టీఆర్ కు సన్నిహితుడే. అందుకే ఆ పాట పాడమని అడిగితే కాదనలేకపోయాడట ఎన్టీఆర్. మరి నానికి ఎన్టీఆర్ గొంతు ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి. ‘సినిమా చూపిస్త మావ’తో సక్సెస్ అందుకున్న త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ‘పక్కా లోకల్’లో నాని సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది మూడో సినిమాతో పలకరించబోతున్న నాని.. ‘పక్కా లోకల్’ను కూడా నాలుగు నెలల్లో పూర్తి చేసి.. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు.

Related

  1. నాని కోసం రాజమౌళి ఏం చేస్తున్నాడంటే?
  2. యేడాదిలో నాని సంపాద‌న తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
  3. నాని ‘మజ్ను’ ఫస్ట్‌లుక్‌ విడుదల
  4. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -