Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ నిజం : ఏపీ అంటే మోడీ కి కుళ్ళు .. అందుకే ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు

- Advertisement -

గుజరాత్ అభివృద్ధిలో ఇండియా లోనే నంబర్ వన్..కాసేపు ఒప్పుకుందాం.దీనికి ధీటుగా అభివృద్ధి చెంద గలిగే రాష్ట్రాలు ఇండియాలో లేవా ? ఎందుకు లేవు..దక్షిణ భారతంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లను గుజరాత్ కు పోటీగా చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా అనే సాయం కావాలి. ఒక అభివుద్ది చెందింది అనడానికి కొలమానం ముందుగా ఆ రాష్ట్రంలోని పారిశ్రామికీకరణే. నరేంద్రమోడీ గుజరాత్ ను పారిశ్రామికీకరణ లో వేగంగా ముందుకు తీసుకెళ్లాడు.దీనివల్లనే గుజరాత్ దేశంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా వెలుగొందుతోంది.

ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో హైదరాబాద్ తెలంగాణాకు వెళుతుంది కాబట్టి ఏపీ దిక్కులేని రాష్ట్రంగా మారింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆంద్రప్రదేశ్ గాయాలను కాంగ్రెస్ మందులు ఇచ్చే ప్రయత్నం చేసింది.అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా హామీని ఇచ్చారు.విభజన వేడిలో ఎవరూ దానిని పెద్దగా పట్టించుకోలేదు ఒక్క వెంకయ్య నాయుడు తప్ప. ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని వెంకయ్య కోరారు. విభజన సంభందించి పార్లమెంట్ లో బిల్ పాసైపోయింది. ఇక వెనువెంటనే ఎన్నికలు. అప్పటికే మోడీ మాయ భారతాన్ని చుట్టేసి ఉంది. ఆంధ్రప్రదేశ్ ను తిరిగి గాడిన పెట్టె నాయకుడి కోసం ప్రజలు వెతుకుతున్నారు. ఆసమయం లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీల త్రయం ప్రజలను ఆకర్షించింది.వెంకయ్య నాయుడు 10 ఏళ్లు అన్న స్పెషల్ స్టేటస్ ను చంద్రబాబు 15 ఏళ్లు అన్నారు. అప్పటివరకు ప్రత్యేకహోదా అంటే ఏమిటో తెలియని ప్రజలు కూడా దానిగురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.అనుకున్నట్లే చంద్రబాబు, మోడీ అధికారంలోకి వచ్చారు.

ఇంకేముంది ఏపీ అభివృద్ధి చెందడం ఖాయం అనుకున్నారు.వారాలు, నెలలు,సంవత్సరాలు.. ఇప్పటికి రెండున్నర ఏళ్ళు గడచిపోయాయి. ప్రత్యేక హోదా రాలేదు..ఇక రాదు. ఇది ఇప్పుడు బిజెపి నేతల మాట.రోజులు మారాయి.. బిజెపి నేతల మాటలు కూడా మారాయి.. ఎందుకు ? ఆంధ్రప్రదేశ్ కు బిజెపి ప్రత్యేక ప్రతిపత్తిని ఎందుకు కల్పించడం లేదు? దీనికి విశ్లేషకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సహజ వనరులు సంవృద్ధిగా ఉన్న రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆయుధమైతే కంపెనీలు క్యూ కడతాయి.పారిశ్రామికీకరణ వేగంగా జరుగుతుంది.ఈ ఆలోచననే ప్రధాని మోడీకి వచ్చిందని అంటున్నారు విశ్లేషకులు.గుజరాత్ నంబర్ వన్ గా ఉన్నన్ని రోజులు ఢిల్లీలో మోడీ ప్రధాని పీఠానికి ఎటువంటి డోకా ఉండదు.గుజరాత్ ను మించి ఏపీ అభివృద్ధి చెందితే చంద్రబాబు ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది.ఈ అసూయతోనే మోడీ ఏపీకి ప్రత్యేక హోదాని దూరం చేశారా ? అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -