Saturday, April 27, 2024
- Advertisement -

ఆరోగ్యానికి ఐదు రకాల జ్యూసులు !

- Advertisement -

గ‌తేడాది చైనాలో వెలుగు చూసి.. యావ‌త్ ప్ర‌పంచాన్ని ప్ర‌స్తుతం గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న కరోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో జీవ‌న‌శైలీ పూర్తిగా మారిపోయింది. ఇదివ‌ర‌క‌టి కంటే అధికంగా అంద‌రూ త‌మ ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ‌ను మ‌రింత‌గా పెంచారు. ముఖ్యంగా వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉండేందుకు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటున్నారు.

కొత్తగా వచ్చే రోగాలను ఎదుర్కోవాలంటే శరీరంలో ఇమ్యూనిటీ పవర్‌ అనేది చాలా ముఖ్యం. అయితే, మ‌నం నిత్యం ఐదు ర‌కాల జ్యూస్‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చు. ఆ ఐదు ర‌కాల జ్యూస్ ల‌లో మొద‌టిది పుచ్చ‌కాయ ర‌సం. నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది. త‌ర్వాతిది టొమాటో జ్యూస్‌. ఇందులో సి, ఇ విటమిన్లు, బీటా కెరోటిన్ ఉంటాయి.

మూడోది.. నిమ్మజాతి పండ్లు కమలాఫలం, ద్రాక్ష, నిమ్మకాయ వంటి పండ్లలో విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో కీల‌కంగా ఉంటాయి. ఇక నాల్గోవ‌ది బీట్‌రూట్‌, క్యారట్‌ జ్యూస్‌. బీట్‌రూట్‌, క్యారట్‌లలో విటమిన్‌ ‘ఎ’, ‘సి’, ‘ఇ’లతో పాటు ఐరన్‌, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఐదోవ‌ది గ్రీన్‌ జ్యూస్ లు. గ్రీన్‌ యాపిల్‌, పాలకూర, కీరా, నిమ్మకాయ, అల్లం.. వంటి వాటితో తయారుచేసే గ్రీన్‌ జ్యూస్‌ రోగనిరోధక శక్తిని బాగా పెంచుతాయి.

వామ్మో ఈ మూడు పండ్లు తిన్నారో మీ ప‌ని అంతే !

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -