Saturday, May 11, 2024
- Advertisement -

త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ.. ప్ర‌తిపాదించిన జ‌స్టిస్ బోబ్డే

- Advertisement -

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బోబ్డే పదవీ కాలం త్వరలోనే పూర్తి కానుంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎవర‌నేదానిపై చ‌ర్చ మొద‌లైంది. ఈ క్ర‌మంలోనే సుప్రీంకోర్టు త‌దుప‌రి ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ పేరును సీజేఐ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ప్ర‌తిపాదించారు.

దీనిని సంబంధించిన జ‌స్టిస్ బోబ్డే త‌న ప్ర‌తిపాద‌న‌ల‌ను ప్ర‌స్తావిస్తూ.. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌కు లేఖ రాశారు. జ‌స్టిస్ బోబ్డే వ‌చ్చే నెల 23న (ఏప్రిల్ 23) ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఈ నేప‌థ్యంలో త‌దుప‌రి సీజేఐ పేరును ప్ర‌తిపాదించాల‌ని వారం రోజుల క్రితం కేంద్ర ప్ర‌భుత్వం ఆయ‌న‌ను కోరింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ ఈ మేర‌కు జ‌స్టిస్ బోబ్డేకు లేఖ రాశారు.

సుప్రీంకోర్టులో జ‌స్టిస్ బోబ్డే త‌ర్వాత జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ మోస్ట్ సీనియ‌ర్ జడ్జి. ఎన్వీ ర‌మ‌ణ 2022, ఆగ‌స్టు 26న రిటైర్ అవుతారు. తెలుగు వ్య‌క్తి అయ‌న జస్టిస్ ర‌మ‌ణ 1957, ఆగ‌స్టు 27న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించారు. వారిది వ్య‌వ‌సాయం కుటుంబ నేప‌థ్యం. 2000, జూన్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టుకు శాశ్వ‌త జడ్జిగా నియ‌మితుడ‌య్యారు. సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించే ముందు ఢిల్లీ హైకోర్టు జ‌డ్జిగానూ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు.

ఈ పెయింటింగ్ ఖ‌రీదు రూ.450 కోట్లు !

త‌మిళ‌నాడు ఎన్నిక‌లు.. ఓట‌ర్ల దుస్తులు ఉతికిన అభ్యర్థి

రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐదుగురు జవాన్ల మృతి

తెలంగాణ‌లో క‌రోనా పంజా.. రేవంత్ రెడ్డికి పాజిటివ్ !

మెగాస్టార్ దూకుడు.. సోనాక్షితో రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -