Monday, April 29, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ తొందర పడకు .. తరవాత బాధపడతావ్ 

- Advertisement -
pawan kalyan response on modi’s currency cancellations

పెద్ద నోట్ల విషయం లో ప్రజలు ఏం అనుకుంటున్నారు ? ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మీద యావత్ దేశం స్పందన ఎలా ఉంది? సామాన్యుడు తన దయనీయ జీవితం ఎంతవరకూ సాగించగలుగుతున్నాడు.

మోడీ తీసుకున్న రద్దు నిర్ణయాన్ని ఎంత బలంగా సమర్థించే వారు ఉన్నారో.. వ్యతిరేకించే వారూ ఉన్నారు. అయితే.. సమర్థించేవారికి.. వ్యతిరేకించే వారికి మధ్యన ఒక పెద్ద వ్యత్యాసం ఉందని చెప్పాలి. రద్దు నిర్ణయంపై మోడీని వ్యతిరేకిస్తున్న విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పేశారు. తన వరుస ట్వీట్లతో నోట్ల రద్దుపై తన వ్యతిరేకతను స్పష్టం చేసిన ఆయన తొందరపడినట్లుగా కనిపిస్తోంది.

విపక్షాలు చెబుతున్నట్లుగా నోట్ల వ్యతిరేకత మీద ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న విషయంపై పవన్ కు అందిన ఫీడ్ బ్యాక్ తప్పన్న వాదన వినిపిస్తోంది. దేశంలో అత్యధికులు రద్దు నిర్ణయాన్ని ఇప్పటికి సమర్థిస్తున్నారు. అయితే.. రద్దు కారణంగా ఏటీఎంలు పని చేయకపోవటం.. బ్యాంకుల దగ్గర క్యూలు వారికిచిరాకు పుట్టిస్తున్నాయి. అయితే..ఈ చిరాకు.. అసహనం అంతా తాత్కాలికమే తప్పించి.. శాశ్వితం కాదన్న విషయాన్ని పవన్ మిస్ అయినట్లుగా కనిపిస్తోంది. తమ అవసరాలకు సరిపడా డబ్బు దొరకలేదన్న ఆగ్రహం ఎవరికైనా మామూలే. కానీ.. చేతిలోకి డబ్బు అందిన తర్వాత.. సామాన్యుడు సైతం మోడీ నిర్ణయాన్ని.. ఆయన ప్రదర్శించిన ధైర్యాన్ని అభినందిస్తున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -