Monday, May 13, 2024
- Advertisement -

ప్రభాస్ తర్వాతి సినిమా టైటిల్ ఇదే!

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి బాహుబలి సినిమాతో ఎలాంటి క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. బాహుబలి సినిమా కోసం నాలుగు సంవత్సరాల టైంను త్యాగం చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత ప్రభాస్ ఏ చిత్రం చేయబోతున్నాడు అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

అయితే రన్ రాజా రన్ సినిమాని తీసిన దర్శకుడు సుజిత్ డైరక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. యు.వి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించబడుతున్న ఈ సినిమా టైటిల్ గా రాధా – ప్రేమ కథ అని పెట్టబోతున్నారని టాక్. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ పవర్ పుల్ పాత్రలో కనిపించబోతున్నాడట. రన్ రాజా రన్ తో మొదటి సినిమానే హిట్ అందుకున్న దర్శకుడు సుజిత్ తన సెంకండ్ ఛాన్స్ ప్రభాస్ లాంటి సూపర్ హీరోతో అవకాశం దక్కించుకోవడం విశేషం.

ఇక ఈ కథ అనుకొని చాలా రోజులవుతున్నా సూపర్ హిట్ అయ్యేలా కావాల్సిన మార్పులన్ని చేస్తున్నాడట.  ప్రభాస్ ను మొదటిసారి పోలీస్ పాత్రల్లో చూపించబోతున్న సుజిత్ ప్రభాస్ ను ఏ రేంజ్ లో చూపించనున్నాడో చూడాలి. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఓ బాలీవుడ్ హీరోయిన్ చేసే అవకాశాలున్నాయట. 

Related

  1. ప్రభాస్ కు ఎందుకు అవార్డులు రావడం లేదంటే?
  2. ప్రభాస్ తో ఫస్ట్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది!
  3. ప్రభాస్ కంటే నేనే ఎక్కువ అంటున్న రానా!
  4. ప్రభాస్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -