Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ కు ఎందుకు అవార్డులు రావడం లేదంటే?

- Advertisement -

ప్రభాస్ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. అతను డాన్స్ వేసిన డైలాగ్ చెప్పిన థియేటర్స్ లో గోల గోల చేయాల్సిందే. ఒక వేళా ప్రభాస్ సినిమా ప్లాప్ అయినప్పటికి అతని నటనకు మంచి మార్కులు పడుతుంటాయి. తన ప్రతి సినిమాకు తన నటనతో కొత్తదనం తీసుకొస్తున్నాడు. అయితే ఇటివలే ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రంతో ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. బాహుబ‌లికి ముందు.. బాహుబ‌లి త‌ర్వాత.. అనే విధంగా మ‌నోడి కెరీర్ గ్రాఫ్ మొత్తం మారిపోయింది. నేష‌నల్ వైడ్ ప్రభాస్ యామ ఫేమ‌స్ అయ్యిపోయాడు.

అయితే మూడేళ్లు ఎలాంటి సినిమాలు చేయకుండా కేవలం బాహుబలికే సమయం కేటాయించి క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాకు ఒక్క అవార్డ్ కూడా రావ‌ట్లేదు. బాహుబలి సినిమాకి గాను ఉత్తమ దర్శకుడు, నిర్మాత‌, ఉత్త‌మ చిత్రం, ఎడిట‌ర్, విల‌న్.. ఇలా ప్రతి విభాగంలోనూ బాహుబ‌లి చిత్రం కు అవార్డులు వచ్చాయి. కానీ బాహుబలి సినిమాకి గాను ఉత్తమ న‌టుడి అవార్డు మాత్రం రావడంలేదు. ఈ విషయంలో ప్రభాస్ కి అన్యాయం జరిగిందని ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ప్రభాస్ కు అవార్డులు ఎందుకు రావడంలేదు అంటే..?

దీనికి వేరే కారణం ప్ర‌భాస్ ప‌ద్ద‌తులే అని అంటున్నారు సినీ పండితులు. నిజానికి ప్రభాస్ తన సినిమాలు తప్పిస్తే వేరే సినిమాల ఆడియో వేడుకలకు ఎక్కువగా వెళ్ళాడు. ప‌బ్లిక్ ఫంక్ష‌న్ ల‌కు రాడు.. ఫంక్ష‌న్ ల‌కు వ‌స్తే గానీ అవార్డులు ఇచ్చే కాలం కాదు ఇది. అయితే ఇప్పుడు ఉన్న టాప్ హీరోలు తమ దగ్గర ఉన్న పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ గా మెయింటేన్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభాస్ చాలా వెనుకల ఉన్నాడు. ప‌బ్లిక్ తో ఎలా ఉండాలి.. ఎప్ప‌టిక‌ప్పుడు జ‌నాల్లో ఎలా క‌లివిడిగా ఉండాలి.. ఏ ఫంక్ష‌న్ కు ఎప్పుడు వెళ్లాలి.. ఎందుకు వెళ్లాలి లాంటివ‌న్నీ చూసుకునేది పిఆర్ టీమే.

మహేష్, ఎన్టీఆర్ లు తమ దగ్గర ఉన్న పిఆర్ టీం చాలా స్ట్రాంగ్ గా మెయింటేన్ చేస్తున్నారు. అందుకే వారికి అవార్డులు వస్తున్నాయి. అల్లు అర్జున్ తీసుకోండి అతడు రుద్ర‌మ‌దేవిలో చిత్రంలో చేసింది అర‌గంట‌ మాత్రమే కానీ అనుష్క కంటే ఎక్కవ అవార్డులు బన్నీకే వస్తున్నాయి. సో ప్రభాస్ తన పద్దతులు మార్చుకుని.. ప్రస్తుతం ఉన్నా ట్రెండ్ ను ఫాలో అయితే అవార్డులు వచ్చే అవకాశం ఉంది లేకపోతే అవార్డుల మాట మర్చిపోవాల్సిందే..!

Related

  1. ప్రభాస్ తో ఫస్ట్ రొమాన్స్ చేయడానికి రెడీ అయ్యింది!
  2. ప్రభాస్ కంటే నేనే ఎక్కువ అంటున్న రానా!
  3. ప్రభాస్ యాక్టింగ్ కి ఫిదా అయ్యారు!
  4. ప్రభాస్ చేతికి రక్తపు మరకలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -