Wednesday, April 24, 2024
- Advertisement -

ఆగిపోయిన సలార్ షూటింగ్

- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్‌ బయటకొచ్చింది. ఆయన అప్‌కమింగ్ మూవీ సలార్ షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది. ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం విదేశాలకు వెళ్లడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్‌కు విదేశాల్లో శస్త్ర చికిత్స చేయనున్నారు. సర్జరీ’తర్వాత కోలుకునేందుకు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

అప్పటివరకు సలార్ షూటింగ్ లేనట్లేనని సమాచారం. సలార్ సినిమా ఇప్పటివరకు దాదాపు 60 శాతం షూటింగ్ మాత్రమే పూర్తయింది. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్‌కు మూవీ మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అనుకోని ఈ అవాంతరం రావడంతో సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

రాధేశ్యామ్ అనుకున్న స్థాయిలో సూపర్ హిట్ కాకపోవడంతో సలార్ పై ప్రభాస్ అభిమానులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో సలార్‌ను తెరకెక్కిస్తున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తుండగా ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. జగపతి బాబు, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

‘ఆర్ఆర్ఆర్’ ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -