రాజమౌళిపై ఆగ్రహంతో ఉన్న హీరోయిన్

- Advertisement -

ఆర్‌ఆర్‌ఆర్‌తో సౌత్‌ పరిచయమైంది బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్. బాహుబలితో దేశవ్యాప్త గుర్తింపు పొందిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి.. దాదాపు ఐదేళ్ల గేప్ తర్వాత ట్రిపుల్ ఆర్ తో మళ్లీ తన సత్తా చాటాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు నమోదు చేస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్‌లో తన పాత్రపై బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

అందుకే రాజమౌళిని ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ అమ్మడు అన్‌ఫోలో చేసిందన్న వార్తలు గుప్పుమన్నాయి. అంతేకాదు ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన అన్ని పోస్టులను సోషల్ మీడియా నుంచి అలియా భట్ డిలీట్ చేయడం దుమారం రేపుతోంది. ఈ సినిమా విజయం సాధించినా.. అలియా ఒక పోస్టు కూడా పెట్టలేదు. మూవీలో తన రోల్ మరీ చిన్నదైందని ఆమె కోపంగా ఉందట.

- Advertisement -

అందుకే గత కొన్ని నెలలుగా జరుతున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో అంతగా యాక్టివ్‌గా లేదు. ఈ మూవీలో అలియా పాత్ర చిన్నదే అయినా.. కథకు కీలకమైన సమయంలో వస్తుంది. అయితే ఈ రూమర్స్‌లో ఇటు అలియా కానీ అటు ఆర్ఆర్ఆర్ బృందం కానీ ఇప్పటివరకు స్పందించలేదు.

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -