ప్రియాంక చోప్రా ఇండియాకు రానుంది. ఏమిటి మన పింకియే కాదా మనదేశంకు రావడంలో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా. యాస్ నిజంగానే సమ్ థింగ్ స్పెషల్. ఈ మధ్య హాలీవుడ్ లో ఫుల్లు బిజీ అయిపోతుంది ఈ బ్యూటీ. దాదాపుగా తన మకాం మొత్తాన్ని అమెరికా షిప్ట్ చేసిన ప్రియాంక.. ఇటు బాలివుడ్ ని కూడా ఓ కంట కనిపెడుతుంది.
ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదుగుతున్న ఈ బ్యూటీ.. ఓ మూడు వారాలు మాత్రమే ఇండియాలోఉంటుంది. ఆ వీక్స్ లో అటు ప్రొఫెషనల్ గాను.. ఇటు పర్సనల్ పనులను కవర్ చేసేకుని మళ్లీ బ్యాక్ టూ హలీవుడ్ అంట. ఇప్పుడు కూడా ఇండియాకు వచ్చేది తను ఒప్పుకున్న సినిమాలకు సంబంధించిన పనులతో పాటు.. తను నిర్మాతగా ప్రారంభిన సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనబోతోందట. గతంలో మాదిరిగానే కొన్ని ఎండార్స్ మెంట్స్.. కూడా ఒప్పుకుని షూటింగ్ చేసేయనుందట. గతంలో కొన్ని రోజులు ఇలాగే ఇండియాకి వచ్చి బోలెడన్ని పనులు పూర్తి చేసుకుని.. బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఇండియాకు ప్రొఫెషనల్ పనుల మీదునే వచ్చిన పీసీ.. జస్ట్ మూడు వారాలలో ఉన్న పనులన్నీ ఫినిష్ చేసేసుకోని డబ్బులు నింపుకుని వెళ్లుతుందట.