Saturday, April 27, 2024
- Advertisement -

న‌గ్న ఫొటో కావాల‌న్న నెటిజ‌న్‌.. షేర్ చేసిన హీరోయిన్‌!

- Advertisement -

అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించిన ఓ నెటిజ‌న్‌కు దిమ్మ‌తిరిగేలా షాకిచ్చింది స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే. న‌గ్న ఫొటో కావాల‌ని అడిగిన అభిమానికి చెంప మీద కొట్టిన‌ట్టు హుందాగానే ఓ ఫొటోను పంపింది. కెరీర్ ఆరంభంలో పెద్ద‌గా స‌క్సెస్ కాని ఈ అమ్మ‌డు… ప్ర‌స్తుతం తెలుగు చిత్ర‌సీమ‌తో పాటు బాలీవుడ్‌లోనూ వ‌రుస అవ‌కాశాలు ద‌క్కించుకుంటోంది.

ఇక ఆమె నటించిన అల్లు అర్జున్ సినిమా అల‌వైకుంఠ‌పురం ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. అందులోని పాట‌లు కూడా అంతే పాపుల‌ర్ అయ్యాయి. ముఖ్యంగా సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న సాంగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే. అందులో పూజా కాళ్ల సౌంద‌ర్యాన్ని వ‌ర్ణిస్తూ.. నీ కాళ్ల‌ను ప‌ట్టుకు వ‌ద‌ల‌న‌న్న‌వి చూడే నా క‌ళ్లు అంటూ పాడ‌తాడు హీరో. ఇదిగో ఇప్పుడు ఆ లైన్లే, నెటిజ‌న్ తుంట‌రి కోరిక‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చేందుకు ఉప‌యోగ‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బుట్ట బొమ్మ తాజాగా ఇన్‌స్టాలో అభిమానుల‌తో ముచ్చ‌టించింది. ఈ సంద‌ర్భంగా ఓ ఫ్యాన్ పూజాను న‌గ్న ఫొటో కావాల‌ని అడిగాడు. దీంతో స్మార్ట్ గా ఆలోచించిన పూజ‌.. త‌న పాదాల‌ను ఫొటో తీసి షేర్ చేసింది. ఇదిగో న్యూడ్‌గా ఉన్న నా పాదాలు చూడు అని మైండ్ బ్లాక్ అయ్యేలా అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో నెటిజ‌న్లు పూజ తెలివిని మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

సుమంత్ అశ్విన్‌ పెళ్లి.. పెళ్లి కూతురు ఎవరంటే..?

కొత్త యాంకర్ ను కుడా వదలని శేఖర్ మాస్టర్!

అయ్యో.. ఆ రెండు సినిమాలకు ఒకే రోజు ప్ర‌మాదం!

అది మ‌రి బ‌న్నీ అంటే.. ఆ మాత్రం ఉంటుందిలే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -