Thursday, April 25, 2024
- Advertisement -

అమ్మ ఒడి రాలేదా.. అయితే నేను ఏమి చెయ్యలేని చితక బాదారు..!

- Advertisement -

విశాఖ జిల్లా కశింకోట మండలం ఏనుగు తుని గ్రామానికి చెందిన.. రూపేష్ గ్రామంలోనే ఎనిమిదో తరగతి వరకు చదివాడు. తొమ్మిదో తరగతి నర్సింగబిల్లిలో చదువుతున్నాడు. 8, 9 వ తరగతికి సంబంధించిన అమ్మఒడి నగదు పడలేదు. ఏనుగు తుని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శర్మని అడగ్గా.. ఆయన వీరావేశంతో విద్యార్థిపై చేయి చేసుకున్నారు. ప్రస్తుతం చదువుతున్న పాఠశాల మేడమ్​ని అడగకుండా తనను ఎందుకు అడుగుతున్నావని విద్యార్థి చెంప ఛెళ్లుమనిపించారు.

అతని తండ్రిని తన వద్దకు రావడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. అయితే.. తాను చెప్తే ఆయన వినరనీ, మీరే చెప్పండి అని.. ఆ విద్యార్థి చెబుతున్నా ప్రధానోపాధ్యాయుడు పట్టించుకోలేదు. ఓ దశలో మెడ పట్టుకుని మరీ చెంపలు వాయించారు. ఈ దృశ్యాలు.. వైరల్ అయ్యాయి.

ఘటనపై ప్రధానోపాధ్యాయుడు శర్మను వివరణ కోరగా.. “విద్యార్థి రూపేష్, అతని అన్నయ్యకి వేర్వేరు బ్యాంకు అకౌంట్ ఖాతాలు ఇవ్వడం వల్లే నగదు పడలేదు” అని వివరణ ఇచ్చారు. ఒకే బ్యాంకు అకౌంట్ ఇవ్వాలని విద్యార్థి తండ్రి దుర్గారావుకు చెప్పామన్నారు. “దుర్గారావు మద్యం సేవించి వచ్చాడు. నా వల్లే అమ్మఒడి నగదు రాలేదని దురుసుగా మాట్లాడాడు. అంతే కాదు… విద్యార్థి రూపేష్ సైతం అమర్యాదగా మాట్లాడాడు. అందుకే మందలించాల్సి వచ్చింది” అని ప్రధానోపాధ్యాయుడు చెప్పుకొచ్చారు.

ఈ సారి ఎన్నికలకి ఈ-వాచ్‌ యాప్‌..!

ఆప్రికాట్ తింటే చక్కటి ఆరోగ్యం!

సరిహద్దులో కాల్పులకు తెగబడ్డ పాక్.. భారత సైనికుడు మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -