సాహోరే టీజర్ కనిపించిన వీళ్లు ఎవరో తెలుస్తే షాకే..

Rajamouli Daughter S S Mayookha in Baahubali 2

సాహోరే బాహుబలి.. సాంగ్ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రభాస్ ఏనుగు మీదికెక్కి దాని తొండంతో విల్లు పట్టించి బాణం వదిలే షాట్ హైలైట్  గా నిలిచింది. ఇంకా ఇందులో హీరోయిజం ఎలివేట్ అయ్యే మరిన్ని షాట్లు ఫ్యాన్స్ ని మురిపించాయి. ఐతే ఇందులో ఎవ్వరూ గుర్తించని మరో విశేషం కూడా ఉంది.

బాహుబలి సింహాసనం మీద కూర్చుంటే తన మీద జనాలు పూలు చల్లే షాట్ ఒకటి గమనించే ఉంటారు. అందులో కనిపించే అమ్మాయిలు.. అబ్బాయిలు బాహుబలి యూనిట్ సభ్యులకు చెందిన పిల్లలే కావడం విశేషం. ఆ షాట్లో పూలు చల్లుతూ కనిపించే ముగ్గురమ్మాయిల్లో మొదట ఉన్నది రాజమౌళి-రమల కూతురు మయూఖ.

ఆ తర్వాత ఉన్నది రమతో పాటు ‘బాహుబలి’ సినిమాకు స్టైలింగ్ చేసిన ప్రశాంతి కూతురు అనన్య. ఆ పక్కన ఉన్న అమ్మాయి కీరవాణి తనయురాలు కుముద్వతి. ఇక ఈ అమ్మాయిల ముందు కనిపించే ఇద్దరు చిన్న అబ్బాయిలు ‘బాహుబలి’ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ కొడుకులు కావడం విశేషం. ‘బాహుబలి’ తన కెరీర్లో అత్యంత ప్రత్యేకమైన.. ప్రతిష్టాత్మకమైన సినిమా కావడంతో తన కుటుంబ సభ్యులు చాలామందికే భాగస్వామ్యం కల్పించినట్లున్నాడు రాజమౌళి. 

{youtube}kPrRGoB7we8{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కీర్తి సురేష్ రేటు ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే
  2. పవన్ రోజుకు ఎంత తీసుకుంటున్నారో తెలుస్తే షాక్ అవుతారు!
  3. బాహుబలి సినిమాకి రమ్యకృష్ణకి ఎంత ఇచ్చారో తెలుస్తే షాక్ అవుతారు
  4. బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు