Sunday, May 19, 2024
- Advertisement -

పెళ్లి చూపులపై ప్రశంసలు కురిపించిన జక్కన్న!

- Advertisement -

ఇటివలే చిన్న సినిమాగా పెళ్లి చూపులు అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి మంచి రేపాన్స్ తెచ్చుకుంటుంది. ఇప్పటికే ఈ చిత్రంపై పరిశ్రమలోని ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ ఉండగా తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించాడు. బిజీ షెడ్యుల్ లో ఉన్నప్పటికి టైం కుదుర్చుకొని రాజమౌళి పెళ్లి చూపులు చిత్రంను చూశారు.

ఈ చిత్రం చూడగానే జక్కన్న తన ట్వీటర్ లో ఈ చిత్ర గురించి స్పందించాడు. పెళ్లిచూపులు సినిమా బాగున్నదని, సినిమా అయిపోయాక కూడా సన్నివేశాల చుట్టే తిరుగుతున్నట్లుగా ఉన్నదని మొదలుపెడుతూ రాజమౌళి సినిమాపై ప్రశంసలు కురిపించారు.  డైరక్షన్ పరంగా,  రైటింగ్ పరంగా, యాక్టింగ్ పరంగా.. ఇలా ప్రతి విషయంలో సినిమా చాలా బాగుంది అన్నారు.

ఇలాంటి సినిమాలకు ఇంకా ఎక్కువ థియేటర్లు దొరకాలని రాజమౌళి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన పెళ్ళిచూపులు సినిమాలో విజయ్ దేవరకొండ, రీతూ వర్మ హీరో హీరోయిన్లుగా నటించారు.

Related

  1. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  2. అనుష్క పై రాజమౌళికి కోపం వచ్చింది!
  3. అనుష్క కి రాజమౌళి వార్నింగ్..?
  4. షాకింగ్ : నాని – రాజమౌళి మళ్ళీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -