Sunday, May 12, 2024
- Advertisement -

కబాలి దెబ్బకి అందరూ బాలి

- Advertisement -

కబాలి సినిమా మేనియా మామూలుగా లేదు. నెల క్రితం విడుదల అయిన అ ఆ సినిమా, జెంటిల్మెన్ సినిమాలు మొన్నటి వరకూ బాగానే ఆడుతూ కలక్షన్ లు లాగుతున్నాయి. మరొక పక్క డబ్బింగ్ చిత్రం బిచ్చగాడు ఊహించని రేంజ్ లో హిట్ అయిపోయి కలక్షన్ ల సునామీ సృష్టించింది. మధ్యలో సేల్ఫీ రాజా, నాయకి లకి సరైన టాక్ కూడా లేదు.

అయితే రేపటి నుంచీ తెలుగు సినిమాలు అన్నింటికీ తెర పడబోతోంది. ఆన్ లైన్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొన్ని గంటల్లోనే ఫస్ట్ వీకెండ్ మొత్తానికి టికెట్లు చాలా వరకు అమ్ముడైపోయాయి. వీకెండ్లో టికెట్లు దొరకని వాళ్లు సోమవారం తర్వాత బుకింగ్స్ చేసుకుంటున్నారు. మొత్తానికి వచ్చే వారం రోజులు బాక్సాఫీస్ దగ్గర ‘కబాలి’ సందడే కనిపించబోతోంది. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న సినిమాలన్నీ ఒకే దెబ్బకు రేసు నుంచి బయటికి వెళ్లిపోనున్నాయి.

ఒక్క ‘బిచ్చగాడు’ మాత్రమే కాస్త నిలబడితే నిలబడొచ్చు. తొలి రోజు చాలా వరకు వేరే సినిమాల్ని పక్కనబెట్టేసి ‘కబాలి’ని ఆడించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. తర్వాతి రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉండొచ్చు. కొన్ని మల్టీప్లెక్సుల్లో అయితే.. ముందు ‘కబాలి’కి కొన్ని షోలే ఇచ్చారు. కానీ టికెట్లు ఇలా పెట్టడం.. అలా అమ్ముడైపోవడం చూసి.. షోలు పెంచుకుంటూ పోతున్నారు. సింగిల్ స్క్రీన్లు సైతం ‘కబాలి’ ద్వారా సాధ్యమైనంతగా సంపాదించుకోవాలని చూస్తున్నాయి.

Related

  1. కబాలి ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యింది!
  2. రేపు మధ్యానం కబాలి సంగతి తేలిపోతుంది
  3. బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది
  4. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -