Monday, April 29, 2024
- Advertisement -

హీరో నితిన్ కి పొగరు పెరిగింది !

- Advertisement -

త్రివిక్రమ్ పుణ్యమా అని నితిన్ తన కెరీర్ లో అతిపెద్ద హిట్ ని అ ఆ మూవీ రూపం లో పొందాడు. ప్రస్తుతం హాలిడే టూర్ కోసం మిలాన్ లో గడుపుతున్నాడు మనోడు. ఈ సినిమా వచ్చి యాభై రోజులు దాటుతున్నా కూడా ఇంకా తరవాతి ప్రాజెక్ట్ కోసం నితిన్ ప్రయత్నాలు చెయ్యడం లేదు. తన కి గుండె జారి గల్లతయ్యిందే లాంటి హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండా కి కూడా నితిన్ నో చెప్పాడు అని తెలుస్తోంది.

సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ ని కాదనేందుకు నితిన్ దగ్గర ఓ రీజన్ ఉంది. ఇప్పుడు తన కెరీర్ లోనే తొలిసారిగా 50 కోట్ల వసూళ్లు సాధించిన సినిమా చేశాడు నితిన్. తన తర్వాతి ప్రాజెక్టు కూడా ఈ రేంజ్ లోనే ఉండాలన్నది ఈ హీరో ఆలోచన. మరి ఆ స్థాయి సినిమా అంటే.. చిన్నాచితకా డైరెక్టర్లు.. మీడియం రేంజ్ మూవీస్ తీసే డైరెక్టర్లతో సాధ్యం కాదు.

మళ్లీ టాప్ డైరెక్టర్ తో చేస్తే మాత్రమే.. తర్వాత సినిమా కూడా ఈ స్థాయికి తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుందని.. నిర్మాణంలో అనుభవం ఉన్న నితిన్ కి బాగానే తెలుసు. విజయ్ కి నో చెప్పాడు అనగానే నితిన్ కి పొగరు పెరిగింది అనుకుంటున్నారు ఫిలిం నగర్ లో.

Related

  1. నితిన్ కూడా అందరిలాంటి వాడే
  2. నానీ కీ నితిన్ కీ కలిసొచ్చింది
  3. నితిన్ నా తమ్ముడిలా అనిపించాడు!
  4. నితిన్ తమిళ్ సినిమాల బాట పట్టాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -