Sunday, May 5, 2024
- Advertisement -

‘కబాలి’ రివ్యూ

- Advertisement -

ఎవ్వరి సినిమాకీ రాని హైప్ , క్రేజ్ తెచ్చుకోగల హీరో రజినీకాంత్. సినిమా ఎలా ఉన్నా ఆయన పేరు చూసి థియేటర్ లకి పరిగెత్తే జనాలు ఉన్నారు . కొత్త డైరెక్టర్ తో రజినీకాంత్ సినిమా ఒప్పుకున్నాడు అనగానే కంగారు పడిన జనాలు. కబాలి మొట్టమొదటి టీజర్ ని చూసి ఎగిరి గంతేశారు. ముసలి గ్యాంగ్ స్టర్ పాత్రలో రజినీకాంత్ ఇచ్చిన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి పిచ్చ పిచ్చగా క్రేజ్ వచ్చేసింది.

టీజర్ కి ముందు ఒకలా టీజర్ తరవాత ఒకలాగా అన్నట్టు అయిపొయింది పరిస్థితి. థియేటర్ లలోకి కబాలి ఎప్పుడు ఒస్తాడా అని ఓవర్ సీస్ తో పాటు ఇక్కడ కూడా జనం విపరీతంగా ఎదురు చూసారు. అయితే కబాలి రానే వచ్చాడు. అద్భుతమైన ఓపెనింగ్ లతో కనీ వినీ ఎరగని హైప్ తో వచ్చిన కబాలి ఎలా ఉందొ చూద్దాం రండి

కథ – పాజిటివ్ లు:

కబాలి అనే ఒక గ్యాంగ్ స్టర్ చుట్టూ తిరుగుతుంది ఈ కథ. మలేషియా జైలు లోంచి ఇరవై సంవత్సరాల తరవాత బయటకి వస్తాడు కబాలి. అతని రేంజ్ ని చాలా సూపర్ గా చూపించాడు డైరెక్టర్. పాత డాన్ ఇన్ని సంవత్సరాల తారవాత బయటకి వస్తే ఎలా ఉంటాడు అనేది బాగా క్యాప్చర్ చేసారు. మలేషియా లో ఇబ్బందులు ఎదురుకొంటున్న భారతీయుల ని రజినీకాంత్ ఆదుకోవడం. అప్పటి కంటే ఇప్పుడు వివక్ష బాగా పెరిగిపోయింది అనీ , రివల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నారు అని తెలుసుకోవడం లో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కి వచ్చే సరికి తన భార్య ని చంపిన వాడు ఎవ్వడు అనే విషయం లో కబాలి కి ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడు అసలైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. రాధిక బతికే ఉంది అనే విషయం కబాలి తెలుసుకుని నిర్ఘాంత పోతాడు. ఆమె కోసం ఇండియా బయలుదేరతాడు కబాలి. ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఆమెతో విడిపోయిన కబాలి ఆమెని చేరుకున్నడా  ? అతనికి ఎదురు అయిన ఇబ్బందులు ఏంటి ? ఈ రకంగా సాగుతుంది కథ. రజినీకాంత్ తన బుజాలతో ఈ సినిమాని లాగేసాడు. చాలా చోట్ల అవసరమైన మేర కంటే చక్కగా నటించాడు. ఓవర్ ఎలేవేషన్ లూ అర్ధం లేని హైప్ లూ లేకుండా సాగుతుంది ఈ క్యారెక్టర్. రాధిక తన పాత్రలో చాలా చక్కగా చేసింది. వయసు పైబడిన వారికి ప్రేమానుబంధాలు ఎలా ఉంటాయో చూపించడం లో డైరెక్టర్ కి రాధిక బాగా ఉపయోగ పడింది. సినిమా మొత్తం మీద కబాలి ఎంట్రన్స్ , ఇంటర్వెల్ బ్యాంగ్ హై లైట్ గా నిలిచాయి ..

నెగెటివ్ లు:

ఈ సినిమాకి అతి పెద్ద నెగెటివ్ ఈ సినిమా కథ. సాధారణంగా అందరూ ఎంచుకునే మామూలు కథనే ఎంచుకున్న రంజిత్ మొదటి నుంచీ కథ సాధారణ ప్రేక్షుకుడు సైతం గెస్ చేసేసేలా తీసాడు. మద్రాస్, అత్తికట్టి లాంటి కథలు తీసిన రంజిత్ చాలా తేలికపాటి కథని ఎంచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. డైరెక్టర్ గా సబ్టిల్ మార్గం లో వెళతాడు అని మంచి పేరు తెచ్చుకున్న రంజిత్ కథ విషయం లో ఎందుకు రాజీ పడ్డాడు అనేది తెలీదు. పోనీ స్క్రీన్ ప్లే విషయం లో ఆసక్తిగా వెళ్ళాడా అంటే అదీ లేదు . ఫస్ట్ హాఫ్ లో పరవాలేదు అనిపించినా సెకండ్ హాఫ్ లో బీ , సి సెంటర్ ఆడియన్స్ ని దారుణంగా యిబ్బంది పెట్టేసాడు. చాలా చోట్ల లాజిక్ లు మిస్ అయిన రంజిత్ రజినీకాంత్ వాకింగ్ మీద పెట్టిన ద్రుష్టి సినిమా స్క్రీన్ ప్లే మీద పెట్టి ఉంటె సినిమా అద్భుతంగా వచ్చేది. ఎమోషనల్ కథని ఎంచుకున్న రంజిత్ రాధిక – రజిని ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అయ్యేలా చూడలేక పోయాడు . ఒక పక్క అందరూ మంచి నటులు ఉన్నా వారినుంచి సరియన అవుట్ పుట్ రాబట్టుకోలేక ఫెయిల్ అయ్యాడు.

మొత్తంగా :

మొత్తంగా చూసుకుంటే రజినీకాంత్ కెరీర్ లోనే అద్భుతమైన హైప్ తో వచ్చిన కబాలి ఆ హైప్ లో రెండో వంతు కూడా అందుకోలేక పోయింది. హైప్ రేగిన సినిమాల కి మరొక సారి బుద్ధి చెబుతూ సాదా సీదా కథ తో సాధారణ సినిమాలగా వెళ్ళిపోయింది కబాలి. ఏ మాత్రం ఆసక్తికరంగా లేని స్క్రీన్ ప్లే. అంతకు మించి చెప్పెయ్య గలిగే కథ ఈ సినిమాకి నెగెటివ్ లు అయితే రజినీకాంత్ తన స్క్రీన్ ప్రేజెన్స్ తో సినిమాని లాక్కొచ్చాడు. డైరెక్టర్ మరి కాస్త జాగ్రత్తా తీసుకుని ఉంటె సినిమా రిజల్ట్ మైండ్ బ్లోయింగ్ గా ఉండేది. కొన్ని సీన్ ల కోసం కబాలి కచ్చితంగా చూడాలని చెప్పచ్చు. ఏదేమైనా యావరేజ్ కలక్షన్ లతో లింగా , కొచ్చాడియాన్ లనాటి ప్లాప్ అవకుండా యావరేజ్ గా సాగి హిట్ వైపు వెళుతుంది ఈ కబాలి.

Related

  1. కబాలి దెబ్బకి అందరూ బాలి
  2. కబాలి ఇంట్రడక్షన్ సీన్ లీక్ అయ్యింది!
  3. బ్రేకింగ్ : లీక్ అయిపోయిన కబాలి సినిమా – ఆన్ లైన్ లో వచ్చేసింది
  4. అందరికంటే ముందే కబాలి సినిమాని చూసింది ఎవరో తెలుసా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -