Thursday, May 16, 2024
- Advertisement -

రామ్ తాత్వికత, రియాలిటీకి దూరంగా

- Advertisement -

రామ్ పోతినేని తన కొత్త చిత్రం ఇస్మార్ట్ శంకర్ ప్రమోషన్స్ కి దూరం గా ఉంటున్నాడు కానీ ఈ సినిమా కి సంబంధించిన డిజిటల్ ప్రమోషన్స్ కి మాత్రం చాలా దగ్గరగా గడుపుతున్నాడు. ఏ చిన్న గ్యాప్ దొరికినా సినిమా గురించి ప్రమోట్ చేస్తూ కాస్త తాత్వికం కూడా బోధిస్తున్నాడు. అయితే ఈ మధ్య మన భూమికి తప్పిన ప్రమాదం గురించి కూడా రామ్ ఒక తాత్వికత తో సందేశం ఇచ్చాడు.

వివరాల్లోకి వెళితే, ఈ మధ్య నే మన భూమి కి అతి దగ్గరగా ఒక సిటీ కిల్లర్ అనే ఒక ఆస్ట్రాయిడ్ వచ్చిందట. అయితే దానిని మన ఆస్ట్రోనామర్స్ కూడా గమనించలేదట. అయితే దీని వలన పెద్ద ప్రమాదమే సంభవించి ఉండేది అని కొందరు చెప్తున్నారు.

అయితే ఇదే విషయాన్ని ఉదహరిస్తూ “తొక్కలో లైఫ్.. ఎప్పుడుంటామో, ఎప్పుడు పోతామో ఎవడికీ తెలియదు. పక్కోడి గురించి, పకోడీలు గురించి పట్టించుకోకుండా, అవ్వాలనుకున్నది అయిపో, చేయాలనుకున్నది చేస్కో, మార్ ముంత, చోడ్ చింతా.” అన్నాడు రామ్.

అయితే ఇదే విషయాన్ని కొందరు నెటిజెన్స్ తప్పు పట్టారు. మనుషులు అందరూ కొన్ని పరిస్థితులకి లోబడి ఉంటారు. అన్ని సార్లు అందరికీ పరిస్థితులని జయించే వెసులుబాటు ఉండదు. రామ్ హీరో కాబట్టి ఏమైనా చెప్తాడు కానీ రియాలిటీ లో అంత ఈజీ కాదు అని రామ్ కి రిప్లై ఇస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -