Tuesday, May 14, 2024
- Advertisement -

‘సాహో’ సబ్ టైటిల్స్ విషయంలో ఫాన్స్ టెన్షన్

- Advertisement -

ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకి కూడా ఓవర్సీస్లో మార్కెట్ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దర్శక నిర్మాతలు కూడా తమ సినిమాలు ఓవర్సీస్ లో రిలీజ్ చేసేటప్పుడు సబ్ టైటిల్స్ పెట్టి విడుదల చేస్తున్నారు. దీంతో తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాక మిగతా వారు కూడా తెలుగు సినిమాలు చూడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ఈ మధ్యనే విడుదలైన ‘మన్మధుడు 2’ సినిమాకి ఓవర్సీస్లో మాత్రమే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా థియేటర్లలో సబ్ టైటిల్స్ వేశారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమాలు చూసేది తెలుగువాళ్లే. మరి వాళ్ళకి సబ్ టైటిల్స్ ఎందుకు? ఈ విషయంలోనే కొందరు అభిమానులు నెగిటివ్ కామెంట్లు కూడా చేశారు.

అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరొక ప్యాన్ ఇండియన్ సినిమాగా విడుదల కాబోతున్న సాహో సినిమా కి కూడా వేరే రాష్ట్రాల్లోనే కాక తెలుగు రాష్ట్రాల్లో కూడా సబ్ టైటిల్స్ వేయనున్నారట. సెన్సార్ కి వెళ్లిన తెలుగు వెర్షన్ కి సబ్ టైటిల్స్ ఉన్నాయట. సబ్ టైటిల్స్ వల్ల వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ దెబ్బ తింటోంది అని అనే వారు కూడా ఉన్నారు. పైగా ‘సాహో’ సినిమాలో అద్భుతమైన విజువల్స్ ఉండబోతున్నాయి. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతోంది. మరి అలాంటిది సబ్ టైటిల్స్ డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తే ఎలా అని ఫాన్స్ భయపడుతున్నారు. మరి 171 నిమిషాల రన్ టైం ఉన్న ‘సాహో’ సినిమా కి ఇక్కడ సబ్ టైటిల్స్ వేస్తారా లేదా చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -